త్రివిక్రమ్ చేతిలో ఆ డైరెక్టర్ భవితవ్యం .. షాకిచ్చిన పవన్ కల్యాణ్

జనసేన పార్టీని వచ్చే ఎన్నికలకు సమాయత్తం చేస్తూనే మరో సినిమాను అంగీకరించి పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాడు పవన్ కల్యాణ్.

By Rajababu

అటు సినిమాలతోనూ, ఇటు రాజకీయాలతోనూ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ యమ బిజీగా ఉన్నాడు. ఒకవైపు త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రంలో నటిస్తునే పార్టీ కార్యక్రమాలను చకచకా నడిపిస్తున్నాడు. జనసేన పార్టీని వచ్చే ఎన్నికలకు సమాయత్తం చేస్తూనే మరో సినిమాను అంగీకరించి పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాడు పవన్ కల్యాణ్. ఆ క్రమంలోనే దర్శకుడు సంతోష్ శ్రీనివాస్‌తో సినిమా చేస్తున్నాడనే వార్తలు బయటకు వచ్చాయి. అయితే ఆ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతున్నది.

Recommended Video

Pawan Kalyan Had Got Back Pain, Kaatamarayudu Shoot Stopped - Filmibeat Telugu
 తెరపైకి తెరి రీమేక్

తెరపైకి తెరి రీమేక్

త్రివిక్రమ్‌తో సినిమా తర్వాత ‘రభస', ‘కందిరీగ' దర్శకుడు సంతోష్ శ్రీనివాస్‌తో సినిమాకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. తమిళంలో దర్శకుడు అట్లీ, విజయ్ కాంబినేషన్లో వచ్చిన తెరికి రీమేక్ అని ప్రచారం జరిగింది.

 తమిళ కథకు మార్పులు

తమిళ కథకు మార్పులు

తమిళ తెరి వెర్షన్‌కు తగు మార్పులు చేయాలని సంతోష్ శ్రీనివాస్‌కు పవన్ కల్యాణ్ సూచించడట. ఆ క్రమంలోనే తెరి సినిమాకు పలు మార్పులు చేసి స్క్రిప్ట్‌ను పవన్‌కు వినిపించాడట.

త్రివిక్రమ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే

త్రివిక్రమ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే

అయితే తెరి కథకు సంతోష్ శ్రీనివాస్ చేసిన మార్పులకు పవన్ కల్యాణ్ సంతృప్తి చెందలేదట. అంతేకాకుండా ఆ కథను దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు వినిపించాలని కోరాడట. అంతేకాకుండా త్రివిక్రమ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే నేరుగా షూటింగ్‌కు వెళ్ధామని కూడా తన అభిప్రాయాన్ని వివరించారట.

 త్రివిక్రమ్‌కు వినిపించే పనిలో

త్రివిక్రమ్‌కు వినిపించే పనిలో

ప్రస్తుతం మార్పులు చేసిన కథను త్రివిక్రమ్‌కు వినిపించే పనిలో ఉన్నాడట సంతోష్ శ్రీనివాస్. ఆ కథకు, మార్పులకు త్రివిక్రమ్ ఎలాంటి రెస్పాన్స్ ఇస్తాడో వేచి చూడాల్సిందే. ఈ నేపథ్యంలో సంతోష్ శ్రీనివాస్ సినిమా పట్టాలకెక్కుతుందా లేదా అనే విషయం చర్చనీయాంశమైంది.

 పవన్‌ కల్యాణ్‌తో మైత్రి మూవీ మేకర్స్

పవన్‌ కల్యాణ్‌తో మైత్రి మూవీ మేకర్స్

మెగా పవర్‌స్టార్ రాంచరణ్‌తో రంగస్థలం 1985 చిత్రాన్ని రూపొందిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ పవన్‌తో సినిమాను నిర్మించడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ సంస్థ అధినేతలు నవీన్ ఎర్నేని, వై రవిశంకర్, మోహన్ తదుపరి సినిమా విషయమై పవన్‌తో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X