Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. టీజర్ వచ్చేది అప్పుడే..
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. క్రియేటివ్ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా మధ్యలో ఆగిపోయినట్లు గతంలో అనేక రకాల కథనాలు వచ్చాయి. కానీ ప్రస్తుతం చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం టీజర్ విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక టీజర్ ఒక స్పెషల్ డేట్ రోజు రాబోతున్నట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారి ఒక చారిత్రాత్మకా అంశంతో సినిమా చేస్తున్నారు అనగానే అభిమానుల్లో తెలియని ఉత్సాహం నెలకొంది. హరిహర వీరమల్లు సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర గతంలో ఎప్పుడు లేని విధంగా సరికొత్తగా ఒక యోధుడిగా కనిపించబోతున్నట్లు ఫస్ట్ లుక్కుతోనే ఒక క్లారిటీ ఇచ్చేశారు. అయితే మధ్యలో ఆ సినిమా మేకింగ్ విధానంలో మార్పులు చేయాలి అని పవన్ కళ్యాణ్ అప్సెట్ అయినట్లు అలాగే వెనుకడుగు వేసినట్లుగా టాక్ అయితే వచ్చింది.

అంతేకాకుండా సినిమా షూటింగ్ కూడా మధ్యలోనే ఆగిపోయే అవకాశం ఉంది అని నిర్మాత ఆర్థిక పరిస్థితుల వలన కూడా పూర్తి కాకపోవచ్చు అని రూమర్స్ కూడా వచ్చాయి. కానీ ప్రస్తుతం చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం ఎప్పటిలానే షూటింగ్ పనుల్లో బిజీ అయిపోయారు. పవన్ కళ్యాణ్ డైరెక్టర్ క్రిష్ ఎంతో సినిమా అవుట్ ఫుట్ పై నమ్మకంగా ఉన్నారని సినిమా తప్పకుండా అనుకున్న సమయానికి విడుదల చేయాలని కూడా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2వ తేదీన విడుదల చేయాలని కూడా ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి అది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరి కొంతకాలం ఆగాల్సిందే. అలాగే పవన్ పుట్టినరోజు సందర్భంగా హరీష్ శంకర్ సినిమా అప్డేట్ కూడా రావచ్చని టాక్ వస్తోంది.


Click it and Unblock the Notifications











