Hari hara veera mallu: పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా మూవీ న్యూ రిలీజ్ డేట్.. ఫిక్స్ అయినట్లే?
టాలీవుడ్ సినిమా ప్రపంచంలో స్టార్ హీరోలందరూ కూడా ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలను లైన్లో పెడుతున్న విషయం తెలిసిందే. ఒక్కసారి ఆ రూట్లో సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవడం లేదు. ఇక తెలుగులో అత్యధిక మార్కెట్ ఉన్న హీరోల్లో ఒకరైన పవన్ కళ్యాణ్ కూడా మొదటిసారి అటువైపు అడుగులు వేయడానికి సిద్ధం అయ్యాడు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమా పాన్ ఇండియా మూవీగా విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ పై ప్రస్తుతం ఒక టాక్ వైరల్ గా మారుతోంది. సినిమా ఎప్పుడు రాబోతోంది అనే వివరాల్లోకి వెళితే..

కొత్త తరహా పాత్రలో..
విలక్షణ దర్శకుడు క్రిష్ చారిత్రాత్మక అంశంతో తెరకెక్కిస్తున్న డిఫరెంట్ యాక్షన్ అడ్వెంచర్ ఫిలిం హరిహర వీరమల్లు సినిమాపై అంచనాలు రోజురోజుకు అమాంతంగా పెరుగుతున్నాయి. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడిగా గ్లామరస్ బ్యూటీ నిధి అగర్వాల్ నటిస్తున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక కొత్త తరహా రాబిన్ హుడ్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

అప్పుడే రిలీజ్ అవ్వాల్సింది..
అసలైతే హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ను గత ఏడాది పూర్తి చేసి ఈ ఏడాది సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కరోనా పరిస్థితుల ప్రభావం వలన సినిమా షెడ్యూల్ వాయిదా వేసుకోవలసి వచ్చింది. అంతే కాకుండా మధ్యలో భీమ్లా నాయక్ సినిమా కూడా రావడంతో పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ కు కాస్త బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది.

ఆలస్యం చేయకుండా..
ఏదేమైనప్పటికీ ఫైనల్ షెడ్యూల్ పూర్తి చేయడంలో చిత్ర యూనిట్ సభ్యులు బిజీగా మారిపోయారు. ఇటీవల ఒక యాక్షన్ సన్నివేశాలతో మళ్లీ షూటింగ్ లోకి అడుగు పెట్టిన పవన్ కళ్యాణ్ వీలైనంత త్వరగా ఆ షెడ్యుల్ ను పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నాడు. దర్శకుడు క్రిష్ కూడా ఆలస్యం చేయకుండా పవన్ కళ్యాణ్ తో ముందుగా అనుకున్న సన్నివేశాలను పూర్తి చేసేందుకు ప్రణాళికలు రచించాడు.

రిలీజ్ ఎప్పుడు?
ఇక ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారు అనే విషయంలో కూడా సోషల్ మీడియాలో అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. అసలైతే ఈ ఏడాది సమ్మర్ లో కూడా హరిహర వీరమల్లు సినిమాను విడుదల చేయాలని చిత్ర యూనిట్ సభ్యులు చాలా ప్రయత్నాలు చేశారు. కానీ అందుకు తగ్గట్టుగా టైమ్ కలిసి రాలేదు.

మరో న్యూ రిలీజ్ డేట్?
ఇక ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం అయితే ఈ ఏడాది దసరా సమయానికి సినిమాను విడుదల చేయాలి అని ఆలోచిస్తున్నారు. అక్టోబర్ 5వ తేదీన హరిహర వీరమల్లు సినిమాను పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా భారీ స్థాయిలో విడుదల చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక వీలైనంత త్వరగా రెగ్యులర్ ప్రమోషన్స్ ను కూడా మొదలుపెట్టాలి అని దర్శకుడు ఆలోచిస్తున్నాడు. ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో రికార్డులను అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











