Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్.. అదిరిపోయే టీజర్.. ఎప్పుడంటే?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇన్నేళ్ల సినిమా కెరీర్ లో ఏనాడు కూడా చారిత్రాత్మక నేపథ్యంలో సినిమాలు చేయలేదు. ఎప్పటికప్పుడు కమర్షియల్ గానే సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన పవర్ స్టార్ మొదటిసారి హరిహర వీరమల్లు సినిమాతో హిస్టరీని టచ్ చేస్తున్నాడు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందుతున్న ఆ సినిమా టీజర్ పై ఇటీవల దర్శకుడు ఇక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అలాగే మరొక పాత్రకు సంబంధించిన లుక్ కూడా రెడీ అయ్యిందట.
Recommended Video
అందరి ఫోకస్ వీరమల్లు పైనే
దర్శకుడు క్రిష్ ఇదివరకే బాలకృష్ణతో గౌతమిపుత్ర శాతకర్ణి అనే సినిమాతో తన టాలెంట్ ఏమిటో నిరూపించుకున్నాడు. ఇక వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జీవిత ఆధారంగా తెరకెక్కిన మణికర్ణికను కూడా అంచనాలకు తగ్గట్లుగానే తెరకెక్కించి తన స్తాయిని మరింత పెంచుకున్నాడు. ఇక ఇప్పుడు అందరి ఫోకస్ హరిహర వీరమల్లు పైనే పడింది.
అంచనాలు అకాశాన్ని దాటేశాయి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి హై వోల్టేజ్ హీరో మొదటిసారి చారిత్రాత్మక కథలో కనిపిస్తుండడంతో అభిమానుల్లో అంచనాలు అకాశాన్ని దాటేశాయి. సినిమా షూటింగ్ కు కరోనా బ్రేకులు వేసిన విషయం తెలిసిందే. లేకపోతే దర్శకుడు క్రిష్ ఈ పాటికే సగానికి పైగా షూటింగ్ ను పూర్తి చేసి ఉండేవారు.
రిలీజ్ పై క్లారిటీ..
పైగా ఈ సినిమా కోసం నిర్మాత ఏఎమ్.రత్నం దాదాపు 150కోట్లకు వరకు కూడా ఖర్చు చేయడానికి రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక షూటింగ్ మరో నెల రోజులు ఆలస్యంగా మొదలైన కూడా రిలీజ్ డేట్ విషయంలో పెద్దగా కన్ఫ్యూజన్ ఉండదని ముందుగానే ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. హరిహర వీరమల్లు 2022 సంక్రాంతికి రానుంది.
టీజర్ కంటే ముందే హీరోయిన్ లుక్..
సినిమాకు సంబంధించిన రెండు స్పెషల్ అప్డేట్స్ పై దర్శక నిర్మాతలు ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ ను విడుదల చేస్తారట. ఇక అంతకంటే ముందే ఆగస్ట్ 17న హీరోయిన్ నిధి అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా పాత్ర యొక్క ఫస్ట్ లుక్ కూడా విడుదల చేస్తారట.
ఇక కీరవాణి మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే. పాటలను కూడా సెప్టెంబర్ అనంతరం ఒక్కొక్కటిగా విడుదల చేయాలని ప్రణాళికలు రచిస్తున్నారు.