1000 మంది యోధులతో పవన్ కళ్యాణ్ ఫైట్.. ఆ సినిమాలో హైలెట్ యాక్షన్ సీన్!
తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం స్టార్ హీరోలందరూ కూడా గతంలో ఎప్పుడూ లేని విధంగా సరికొత్త ప్రాజెక్టులను తెరపైకి తీసుకువస్తున్నారు. ముఖ్యంగా పాన్ ఇండియా మార్కెట్ అమితంగా పెరగడంతో బడ్జెట్ విషయంలో కూడా వెనక్కి తగ్గకుండా నిర్మాతలు దర్శకులు భారీగా ఖర్చు చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ చేస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ కి సంబంధించిన అనేక రకాల విషయాలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక ఈ సినిమా లోని ఒక ఫైట్ సీన్ గురించి కూడా ప్రస్తుతం ఒక టాక్ వినిపిస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

మొట్టమొదటి పాన్ ఇండియా
టాలెంటెడ్ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేస్తున్న మొట్టమొదటి పాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు. పవర్ స్టార్ సినీ కెరీర్లోనే ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఖుషి నిర్మాత ఎ.ఎం.రత్నం ఈ సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు. కానీ షూటింగ్ పనులు ఆలస్యం కావడంతో అప్పుడూ కుదర్లేదు.

16వ శతాబ్దంలో..
చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమాలో ఎక్కువగా 16 వ శతాబ్దం నాటి అంశాలను హైలెట్ చేసి చూపించబోతున్న ట్లు సమాచారం. ముఖ్యంగా గండికోట చార్మినార్ కు సంబంధించిన చారిత్రాత్మక అంశాలను కూడా సినిమాలో కనిపిస్తాయట. సినిమాలోని ప్రత్యేకమైన సెట్స్ కోసమే నిర్మాతలు భారీగా ఖర్చు చేస్తున్నట్లు సమాచారం.

యాక్షన్ షెడ్యూల్
ఇటీవల దర్శకుడు క్రిష్ పవన్ కళ్యాణ్ తో ఒక యాక్షన్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రత్యేకమైన షెడ్యూల్ ను కూడా మొదలు పెట్టాడు. ఆ యాక్షన్ సన్నివేశాల కోసం పవన్ కళ్యాణ్ ముందుగానే ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. వర్క్ షాప్ లోనే ముందుగానే ప్లాన్ సిద్ధం చేసుకుని షూటింగ్ చేసినట్లు సమాచారం.

వెయ్యిమందితో యాక్షన్ సీన్
యాక్షన్ సన్నివేశాల కోసం పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ నిపుణులతో కలిసి కొంత శిక్షణ కూడా తీసుకోవడం జరిగింది. అందుకే సంబంధించిన యాక్షన్ సన్నివేశాల కోసం ముందుగానే ప్రిపేర్ అయ్యి ఆ తర్వాత షూటింగ్ కు వెళ్లడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ సినిమా లో ఒకేసారి వెయ్యిమంది యోధులతో ఫైట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇంటర్వెల్ లో వచ్చే ఆ యాక్షన్ సీన్ సినిమా మొత్తంలో హైలెట్గా ఉంటుందట.

పవర్ స్టార్ రేంజ్ కు తగ్గట్టుగా..
ఒకవైపు చారిత్రాత్మక అంశాలను హైలెట్ గా చూపిస్తున్న దర్శకుడు క్రిష్ పవన్ కళ్యాణ్ రేంజ్ కు తగ్గట్టుగా ఫ్యాన్స్ ఇష్టపడే ఎలివేషన్స్ కూడా తనదైన శైలిలో ప్రజెంట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని అభిమానులలో ఒక గట్టి నమ్మకం అయితే ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఇలాంటి హిస్టారికల్ నేపథ్యం ఉన్న సినిమాలను చేసింది లేదు. మరి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి. ఇక సినిమాను ఈ ఏడాది దసరకు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











