హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లే.. పోటీకి గ్యాప్ ఇచ్చిన బాలయ్య!
సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల మధ్య పోటీ ఉంటే ఆ వాతావరణమే వేరుగా ఉంటుంది. ముఖ్యంగా మెగా నందమూరి హీరోల సినిమాలు ఒకేసారి విడుదలవుతున్నాయి అంటే ఆ రెండిటిలో ఏది ఎక్కువ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటుంది అనే కుతూహలం అభిమానుల్లో కూడా గట్టిగానే ఉంటుంది. ఇక ఈ ఏడాది దసరా సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నందమూరి బాలకృష్ణ సినిమాలు ఒక వారం గ్యాప్లో విడుదల కాబోతున్నాయి. దాదాపు ఈ సినిమాల రిలీజ్ డేట్స్ కూడా ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

చారిత్రాత్మక నేపథ్యంలో..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్ లోనే మొట్టమొదటిసారిగా ఒక చారిత్రాత్మక నేపథ్యంలో ఉన్న సినిమాలో నటిస్తూ ఉండడం విశేషం. హరిహర వీరమల్లు సినిమా లో ఔరంగజేబుకు సంబంధించిన కాలంనాటి ఎన్నో హిస్టారికల్ పాయింట్స్ ను దర్శకుడు హైలెట్ చేయబోతున్నతకు టాక్. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక సమరయోధుడిగా కనిపించబోతున్నాడు.

ఫస్ట్ లుక్ నుంచి ఫస్ట్ టీజర్ వరకు
ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ కూడా ప్రేక్షకుల్లో అంచనాల స్థాయిని ఒక్కసారిగా పెంచేసింది. సినిమా ఫస్ట్ లుక్ నుంచి ఫస్ట్ టీజర్ వరకు కూడా సోషల్ మీడియాలో భారీ స్థాయిలో బజ్ క్రియేట్ చేశాయి. ఈ సినిమాను నిర్మాత ఏఎం.రత్నం ఫ్యాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సగానికి పైగా సినిమా షూటింగ్ పూర్తయింది. ఇక త్వరలోనే విడుదల డేట్ పై కూడా క్లారిటీ ఇవ్వబోతున్నారు.

రిలీజ్ డేట్ ఫిక్స్?
ఇక హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ విషయంలో ఇప్పటికే ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే వినిపిస్తోంది. ఈ సినిమాను దసరా సమయంలో కచ్చితంగా విడుదల చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇక లేటెస్ట్ గా అందిన సమాచారం ప్రకారం అక్టోబర్ 13వ తేదీన హరిహర వీరమల్లు గ్రాండ్ గా విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

బాలకృష్ణ 108వ సినిమా
అయితే పవన్ కళ్యాణ్ సినిమా తో పాటు అదే సమయంలో నందమూరి బాలకృష్ణ కూడా బాక్సాఫీస్ వద్ద పోటీకి రాబోతున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న 108వ సినిమా పై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. అసలైతే ఈపాటికే ఈ సినిమా షూటింగ్ మొదలు కావాలి. కానీ నందమూరి ఫ్యామిలీలో విషాదం చోటు చేసుకోవడంతో మళ్లీ కొంత బ్రేక్ ఇవ్వాల్సి వస్తోంది.

రిలీజ్ డేట్ కూడా ఫిక్స్
అయితే ఈ సినిమాను కూడా అక్టోబర్ లోనే విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఇంకా రెగ్యులర్ షూటింగ్ మొదలు కాలేదు కానీ దర్శకుడు పక్క ప్రణాళికతో ఈ సినిమా షూటింగ్ ను సెప్టెంబర్ మొదటి కల్లా ఫినిష్ చేయాలని అనుకుంటున్నాడు. ఇక అక్టోబర్లో సినిమా రెగ్యులర్ ప్రమోషన్ స్టార్ట్ చేసి అదే నెల 20వ తేదీన గ్రాండ్ గా విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు. మరి ఈ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











