హరీష్ శంకర్, పవన్ కాంబో క్రేజీ అప్డేట్.. భయపెట్టే పాత్రలో పవర్ స్టార్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో డిజాస్టర్స్ ఎన్ని ఉన్నా కూడా ఆయన మార్కెట్ పై కొంత ప్రభావం కూడా చూపించలేదని చెప్పవచ్చు. ఒక సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా ఆ తరువాత సినిమాపై వెంటనే హైప్ క్రియేట్ చేయగల అతి తక్కువ మంది హీరోల్లో పవన్ కళ్యాణ్ ఒకరు. ఇక హరీష్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా యొక్క స్పెషల్ గాసిప్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

రెండు విభిన్నమైన షేడ్స్ లలో..

రెండు విభిన్నమైన షేడ్స్ లలో..

గబ్బర్ సింగ్ సినిమా అనంతరం చాలా కాలం తరువాత పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్న హరీష్ శంకర్ ఈ సారి ఎలాగైనా అంతకంటే హై రేంజ్ లో తన అభిమాన హీరోకు సక్సెస్ ఇవ్వాలని అనుకుంటున్నాడు. హరీష్ పై నమ్మకంతో ఉన్న అభిమానులు కూడా ఆ సినిమాపై అంచనాలు భారీగానే పెంచేసుకున్నారు. ఇక ఈ సినిమాలో పవన్ లుక్ కూడా చాలా కొత్తగా ఉంటుందట. రెండు విభిన్నమైన షేడ్స్ లలో కనిపిస్తాడని సమాచారం.

భయపెట్టే బిగ్గెస్ట్ డాన్ పాత్రలో..

భయపెట్టే బిగ్గెస్ట్ డాన్ పాత్రలో..

ఒక పాత్రలో నార్మల్ యువకుడి పాత్రలో సరదాగా ఉంటూ మంచి విలువలున్న వ్యక్తిగా కనిపించే పవన్ మరో క్యారెక్టర్ లో మాత్రం చాలా కటినంగా ఉంటాడట. అందరిని భయపెట్టే బిగ్గెస్ట్ డాన్ పాత్రలో కూడా కనిపిస్తాడని తెలుస్తోంది. గతంలో పంజా సినిమాలో గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించిన పవన్ ఈ సారి స్టైలిష్ అని కాకుండా చూడగానే భయపడలా ఉంటాడని టాక్ వస్తోంది.

 సినిమాలో అదే హైలెట్

సినిమాలో అదే హైలెట్

పవన్ డాన్ పాత్ర కేవలం ఒక ఫ్లాష్ బ్యాక్ లో కొద్దీ సేపే ఉంటుందట. కానీ అదే సినిమాకు హైలెట్ అని సమాచారం. నెవర్ బిఫోర్ అనేలా పవన్ ఎట్రాక్ట్ చేస్తాడని తెలుస్తోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ లుక్స్ కి సంబంధించిన స్పెషల్ ఆర్ట్ రెడీ చేయించడట దర్శకుడు హరీష్. పవన్ ఎలా ఉండాలి అని దానిపై తన టీమ్ తో చర్చించి ఫైనల్ డిసిషన్ కూడా తీసుకున్నట్లు సమాచారం.

Recommended Video

Pawan Kalyan New Movie Details,మళ్ళీ పోలీస్ ఆఫీసర్‌‌గా.. ఇక ఫాన్స్ కి పుల్ మీల్సే!
 సినిమా రిలీజ్ ఎప్పుడంటే..?

సినిమా రిలీజ్ ఎప్పుడంటే..?

ఇక పవన్ కళ్యాణ్ ఆ ప్రాజెక్ట్ బారమంతా కూడా హరీష్ పైనే ఉంచాడట. సమయం లేకపోవడం వలన మిగతా ప్రాజెక్టులపై పెట్టినంత ఫోకస్ పవన్ ఆ ప్రాజెక్ట్ పై పెట్టలేకపోతున్నాడు. ఇక దర్శకుడు హరీష్ శంకర్ ఫైనల్ స్క్రిప్ట్ పనుల కోసం ఇంకాస్త టైమ్ అడిగినట్లు టాక్ అయితే వస్తోంది. వీలైనంత వరకు పూర్తిగా స్క్రిప్ట్ సిద్దమైన తరువాతనే సినిమాను స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాడు హరీష్. ఇక వచ్చే ఏడాది షూటింగ్ స్టార్ట్ చేసి 20201 సంక్రాంతికి సినిమాను ప్రేక్షకులకు ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X