Don't Miss!
- Sports T20 World Cup 2024: సంజూ శాంసన్‌కు మళ్లీ అన్యాయమే!
- News మోదీని ప్రధానిని చెయ్యండి.. తెలంగాణాలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా
- Technology వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
పవన్ కళ్యాణ్ కోసం స్పెషల్ స్కెచ్.. స్పీడ్ పెంచిన స్టార్ డైరెక్టర్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొత్తానికి వకీల్ సాబ్ సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్నాడు. 100కోట్ల వసూళ్లతో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన పవన్ కళ్యాణ్ ఒక రీమేక్ సినిమాతోనే ఈ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు అంటే.. ఇక డైరెక్ట్ సినిమా వస్తే రికార్డులు ఏ రేంజ్ లో ఉంటాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. నెక్స్ట్ పవర్ఫుల్ సినిమాలు లైన్ లో ఉన్న విషయం తెలిసిందే.
మళయాళం హిట్ మూవీ అయ్యప్పనుమ్ కొశీయుమ్ సినిమాతో రెడీ అవుతున్న పవన్ కళ్యాణ్ ఆ తరువాత క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న హరహర వీరమల్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సంక్రాంతి కానుకగా ఆ సినిమా విడుదల కానుంది. ఇక హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్న చేయనున్న విషయం తెలిసిందే. ఆ సినిమాకు సంబంధించిన రూమర్స్ బాగానే వైరల్ అవుతున్నాయి.
ఇక అయ్యప్పనుమ్ కొశీయుమ్ రీమేక్ అయిపోగానే హరీష్ సినిమాని కూడా సెట్స్ పైకి తేవాలని అనుకుంటున్నారట. ఇక దర్శకుడు హరీష్ టెస్ట్ లుక్ కోసం ఫొటో షూట్ నిర్వహించడానికి రెడీ అయినట్లు సమాచారం. ఇప్పటికే కొన్ని గెటప్స్ పై స్కెచ్ లు వేయించిన హరీష్ శంకర్ పవన్ ను క్లాస్ తో పాటు మాస్ లుక్ లో కూడా చూపించాలని అనుకుంటున్నాడు. త్వరలోనే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక సినిమాకు 'సంచారి' అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు సమాచారం.