Don't Miss!
- News దానం నాగేందర్ కు షాక్ - కాంగ్రెస్ అభ్యర్ది మార్పు..!?
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
గబ్బర్ సింగ్ కాంబో.. ఈ సారి ఆ స్పెషల్ ఏమి లేదట!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే ఆ సినిమా రిలీజ్ కంటే ముందే పవన్ మరికొన్ని సినిమాలని సెట్స్ పైకి తేబోతున్నాడు. ముందుగా అయ్యప్పనుమ్ కొశీయుమ్ రీమేక్ ను 40రోజుల్లోగా పూర్తి చేయాలని ఒక టార్గెట్ సెట్ చేసుకున్నాడు.
ఇక ఆ తరువాత క్రిష్ దర్శకత్వంలో మరో పిరియాడిక్ సినిమాను సెట్స్ పైకి తెనున్న విషయం తెలిసిందే. ఇక దర్శకుడు హరీష్ శంకర్ పవన్ కోసం ఒక పవర్ఫుల్ కథను రెడీ చేస్తున్నాడు. వీరి కాంబినేషన్ పై ఇదివరకే ఒక క్లారిటీ వచ్చింది. సినిమాకు సంబంధించిన అనేక రకాల రూమర్స్ అయితే బాగానే వైరల్ అవుతున్నాయి. సినిమాలో పవన్ మళ్ళీ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ అని టాక్ వస్తోంది. అలాగే డబుల్ యాక్షన్ అని కూడా కథనాలు వచ్చాయి.
కానీ ఇన్ సైడ్ టాక్ ప్రకారం అలాంటిదేమి లేదని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఇప్పటికే అయ్యప్పనుమ్ కొశీయుమ్ లో ఒక పోలీస్ పాత్రలో నటించనున్న విషయం తెలిసిందే. ఇక హరీష్ శంకర్ సినిమాలో కూడా అలానే కనిపిస్తాడు అనే రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. హరీష్ శంకర్ మార్క్ ఎంటర్టైన్మెంట్ తో పాటు సినిమాలో ఒక మంచి సందేశం ఉంటుందని సమాచారం. చూడాలి మరి సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో..