రష్యన్ భామతో పవన్ కళ్యాణ్ మూడో కాపురం? ఆమెను కూడా తల్లిని చేసినట్లు వార్తలు.!
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోయిన్ రేణు దేశాయ్‌తో ప్రేమాయణం సాగించి..ఓ బిడ్డ కూడా పుట్టాక పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా పవర్ కళ్యాణ్‌పై మరో రూమర్ గుప్పుమంది. ఈ స్టార్ హీరో ముచ్చటగా మూడో భామతో కాంపురం మొదలు పెట్టారని ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తున్నాయి.
ఓ ప్రముఖ తెలుగు చానల్‌లో వచ్చిన కథనం ప్రకారం.... పవన్ కళ్యాణ్‍తో కలిసి తీన్ మార్ చిత్రంలో నటించి రష్యన్ భామ దానా మార్క్‌తో పవన్ కళ్యాణ్ గత కొంత కాలంగా వ్యవహారం నడిపిస్తున్నారని, తాజాగా వీరిద్దరు అమ్మానాన్నలు కూడా అయ్యారని వార్తలు వినిపిస్తున్నట్లు సదరు చానల్ పేర్కొంది.
తీన్ మార్ చిత్రం నుంచే వీరి మధ్య చనువు పెరిగిందని, ఇద్దరు సెట్లోనే చెట్టాపట్టాలేసుకుని తిరిగే వారని.. క్రమక్రమంగా బంధం బలపడిందని అంటున్నారు. తీన్ మార్ ఆడియో ఫంక్షన్లో ఆ రష్యన్ భామ గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరు కూడా ఈ వార్తలకు బలం చేకూర్చాయి. తీన్ మార్ సినిమా సమయంలోనే వీరి బంధంపై పుకార్లు షికార్లు చేసాయి. తాజాగా ఇద్దరు అమ్మానాన్నలు అయ్యారనే వార్తలు అభిమానులను, సినీ జనాలు షాక్‌కు గురి చేస్తున్నాయి. ఏది ఏమైనా ఈ వార్తల్లో నిజా నిజాలు తేలాల్సి ఉంది.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో తమన్నా హీరోయిన్. పవర్ స్టార్ జర్నలిస్టు పాత్రలో, కమెరామెన్ పాత్రలో తమన్నా నటిస్తోంది. ఈచిత్రానికి సంగీతం: మణి శర్మ, నిర్మాత: బండ్ల గణేష్.


Click it and Unblock the Notifications











