బర్త్‌డే రోజు పవన్ ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు?
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకను ఈ రోజు ఫ్యాన్స్ అంతా ఘనంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్‌కు పుట్టినరోజు వేడుకను చేసుకోవడం ఇష్టం లేక పోయినా.....ఫ్యాన్స్ మాత్రం తమ అభిమాన హీరో బర్త్ డే వేడుకలను చేసుకుంటూ సంబరాలు జరుపుకుంటున్నారు.
మరి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు? అనే విషయాలు ఆరా తీస్తే....ఆయన తన పుట్టినరోజు గురించి ఏమీ పట్టించుకోకుండా ‘గోపాలా గోపాలా' షూటింగులో పాల్గొన్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం తెలిసిన యూనిట్ సభ్యులు కూడా పుట్టినరోజు వేడుకలు లాంటి హడావుడి ఏమీ చేయకుండా మిన్నకుండి పోయినట్లు సమాచారం.

గోపాలా గోపాలా సినిమా విషయానికొస్తే...పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వెంకటేష్ కాంబినేషన్లో 'గోపాలా గోపాలా' చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో వెంకీ సరసన శ్రియ నటిస్తోంది. కిషోర్ పార్థసాని (డాలి) దర్శకుడు. హిందీలో విజయవంతమైన 'ఓ మైగాడ్'కిది రీమేక్. అందులో పరేష్ రావల్ పోషించిన పాత్రను ఇక్కడ వెంకటేష్, అక్షయ్ కుమార్ చేసిన కృష్ణుడు పాత్రను పవన్ కల్యాణ్ చేస్తున్నారు.
సురేష్ ప్రొడక్షన్స్, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. డి.సురేష్‌బాబు, శరత్‌మరార్ నిర్మాతలు. ఈ చిత్రంలో పోసాని కృష్ణమురళి, కృష్ణుడు, రఘుబాబు, దీక్షాపంత్, అంజు అస్రాని తదితరులు ఇతర పాత్రధారులు. చిత్రానికి మాటలు: సాయిమాధవ్ బుర్రా, ఛాయాగ్రహణం: జయనన్ విన్సెంట్, సంగీతం: అనూప్ రూబెన్స్, కూర్పు: గౌతంరాజు, కళ: బ్రహ్మ కడలి.


Click it and Unblock the Notifications











