For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

    మోహన్ బాబును పవన్ కళ్యాణ్ ఇమిటేట్ చేసాడా?

    By Bojja Kumar
    |
    హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన గత సినిమా 'గబ్బర్ సింగ్'లో రాజశేఖర్‌ను ఇమిటేట్ చేసి నవ్వులు పూయించిన సంగతి తెలిసిందే. తన రాబోయే సినిమా 'అత్తారింటికి దారేది' చిత్రంలో పవన్ కళ్యాణ్ ఈ సారి మోహన్ బాబును ఇమిటేట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. థియేటర్లో నవ్వుల వర్షం కురిసే విధంగా ఈ సీన్‌ ఉండనుందట.

    తెలుగు సినీ అభిమానుల అందరి దృష్టీ అత్తారింటికి దారేది చిత్రం విడుదల మీదే ఉంది. సమైక్యాంధ్ర ఉద్యమకారుల ఆందోళన కార్యక్రమాలు, చిరంజీవి ఫ్యామిలీ సినిమాలను సీమాంధ్ర ప్రాంతంలో అడ్డుకుంటామనే హెచ్చరికల నేపథ్యంలో విడుదల నిలిచి పోయిన 'అత్తారింటికి దారేది' చిత్రాన్ని అక్టోబర్ 9న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

    'అత్తారింటికి దారేది' చిత్రం సెన్సార్ బోర్డు సభ్యుల నుంచి ఈ చిత్రం క్లీన్ 'U' సర్టిఫికెట్ పొందింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో బివిఎస్ఎన్ ప్రసాద్ రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్‌తో కలిసి సంయుక్తంగా నిర్మించారు. పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ ఈచిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా వినోదాత్మకంగా తెరకెక్కించారు. కామెడీ, యాక్షన్, రొమాన్స్ ఇలా అన్ని కమర్షియల్ అంశాలు ఇందులో ఉంటాయి.

    ఈచిత్రంలో నదియా పవన్ కళ్యాణ్ అత్త పాత్రలో నటించారు. కోట శ్రీనివాస్, అలీ, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఈచిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.

    English summary
    
 Pawan Kalyan had made a comedian imitate Rajasekhar in an Anthyakshari episode in Gabbar Singh, it’s also heard that he tried to imitate Mohanbabu in his upcoming movie Attarintiki Daredi, the actual facts will be known only after it’s release.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more