‘పికె’ హక్కులు: పవన్ కళ్యాణ్ నిర్ణయం కోసం..?
హైదరాబాద్: అమీర్ ఖాన్ హీరోగా రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పికె' చిత్రం ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. కామెడీతో పాటు సోషల్ మెసేజ్ కూడా ఉండటంతో ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది. అమీర్ ఖాన్ విభిన్నమైన పెర్ఫార్మెన్స్ సినిమాకు మెయిన్ హైలెట్. డిసెంబర్ 9న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే 100 కోట్ల మార్కును అందుకుంది.
‘పికె' వసూళ్ల సంగతి పక్కన పెడితే....ఈ చిత్రం రీమేక్ హక్కులను దక్కించుకునే ఆలోచన కొందరు తెలుగు నిర్మాతలు ఉన్నారని, పవన్ కళ్యాణ్ ఫ్రెండ్, నిర్మాత శరత్ మారర్ ఈ దిశగా ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. అయితే హక్కులు తీసుకునే ముందుకు పవన్ కళ్యాణ్ నిర్ణయం ఏమిటో కనుక్కోవాలని అనుకుంటున్నాడట.

పవన్ కళ్యాణ్....ఓకే చెప్పడం, చెప్పక పోవడంపైనే శరత్ మరార్ ‘పికె' హక్కులు తీసుకోవడం ఆధార పడి ఉంటుందని టాక్. మరి పవన్ కళ్యాన్ ఓకే చెబితే సినిమా ఎవరితో తీస్తారు? అనేది కూడా హాట్ టాపిక్ అయింది. ఆయన నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి పవన్ తోనే తీసే ఆలోచన ఆయన చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌తో శరత్ మరార్ ‘గోపాల గోపాల' చిత్రం తెరకెక్కిస్తున్నసంగతి తెలిసిందే. ఇందులో వెంకీ మెయిన్ రోల్ చేస్తున్నారు. బాబి దర్శకత్వం వహిస్తున్నారు. హిందీలో హిట్టయిన ‘ఓ మై గాడ్' చిత్రానికి ఇది రీమేక్.


Click it and Unblock the Notifications











