సూపర్ స్టార్ మూవీలో పవన్ కళ్యాణ్.. ఇక థియేటర్లు దద్దరిల్లాల్సిందే!

పవర్ స్టార్‌గా కోట్లాది అభిమానుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). సాధారణంగా హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు, కానీ పవన్ కళ్యాణ్‌కు మాత్రం అభిమానులు మాత్రమే కాదు.. సినిమా ఇండస్ట్రీలోని పలువురు హీరోలకే ఆయనే ఇన్స్పిరేషన్. ఆయన సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా ఫ్యాన్స్‌లోని ఉత్సాహం ఎప్పటికీ తగ్గదు. అందుకే పవన్ కళ్యాణ్ పేరు ఒక బ్రాండ్‌గా మారిపోయింది. అయితే.. ప్రస్తుతం ఒకవైపు రాజకీయ బాధ్యతలు నిర్వహిస్తూ, మరోవైపు సినిమాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్... ఇప్పుడు మరోసారి ఆసక్తికర వార్తలతో వార్తల్లో నిలిచారు. తాజా సమాచారం ప్రకారం.. ఓ సూపర్ స్టార్ సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నారనే టాక్ సినీ వర్గాల్లో హల్‌చల్ చేస్తోంది. ఇంతకీ ఆ సినిమా ఏంటీ?

పవన్ కణ్యాణ్ ఒక క్రేజీ ప్రాజెక్ట్‌తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారారు. ముఖ్యంగా సూపర్ స్టార్ సినిమా కోసం ఆయన పేరు వినిపించడం అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆ సూపర్ స్టార్ ఎవరో కాదు.. సౌత్ ఇండియన్ సినిమాకు గ్లోబల్ ఐకాన్‌గా నిలిచిన రజనీకాంత్.. ప్రస్తుతం ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల విడుదలైన కూలీ (Coolie) సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోకపోయినా, ఆయన క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం సెన్సేషనల్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జైలర్ 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. 2023లో వచ్చిన జైలర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించడంతో, ఈ సీక్వెల్‌పై మరింత హైప్ ఏర్పడింది.

Pawan Kalyan in Rajinikanth Jailer 2 Cameo Massive Buzz Grips Film Industry

ఇక జైలర్ 2 ( Jailer 2)కి సంబంధించిన తాజా బజ్ ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మొదట ఈ సినిమాలో స్పెషల్ క్యామియో కోసం బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ (Shah Rukh Khan)పేరు వినిపించింది. రజినీకాంత్‌తో ఆయనకు ఉన్న అనుబంధం, గతంలో వచ్చిన రిఫరెన్స్‌లు అన్ని కారణాల వల్ల ఈ కాంబినేషన్‌పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే డేట్స్ సమస్యల కారణంగా షారుఖ్ ఈ ప్రాజెక్ట్‌లో వైదొలిగినట్టు వార్తలు వచ్చాయి.

ఈ తరుణంలో ఈ స్పెషల్ క్యామియో రోల్ కోసంటాలీవుడ్ స్టార్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)పేరు కూడా వినిపించింది. ముఖ్యంగా పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆయన కనిపిస్తారనే ప్రచారం బలంగా నడిచింది. కానీ, డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో బాలకృష్ణ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

అయితే ఇప్పుడు అనూహ్యంగా ఈ క్యామియో రోల్ కోసం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పేరు తెరపైకి రావడం మరింత సెన్సేషన్ క్రియేట్ చేసింది. తమిళ సినీ వర్గాల సమాచారం ప్రకారం.. దర్శకుడు నెల్సన్ స్వయంగా పవన్‌ను సంప్రదించారని, ఆయన కూడా ఈ పాత్రపై సానుకూలంగా స్పందించారని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇది నిజమైతే, ఒకే ఫ్రేమ్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ రజినీకాంత్ కనిపించడం ఫ్యాన్స్‌కు పండగ వాతావరణాన్ని తీసుకొస్తుందని చెప్పాలి.

అయితే, ఈ వార్తలపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. ముఖ్యంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్, రాజకీయాలతో బిజీగా ఉన్న నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్‌కు సమయం కేటాయిస్తారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సినీ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఇది ప్రస్తుతానికి ఒక రూమర్ మాత్రమే అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఇదిలా ఉంటే, సోషల్ మీడియాలో ఈ వార్తలు వైరల్ అవుతుండటంతో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయారు. కొందరు ఈ కాంబినేషన్ నిజమవుతుందని ఆశపడుతుంటే, మరికొందరు ఇది కేవలం బజ్ క్రియేట్ చేయడానికి వచ్చిన రూమర్ మాత్రమేనని భావిస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ షెడ్యూల్‌ను దృష్టిలో పెట్టుకుంటే, ఈ క్యామియో సాధ్యమా అన్నది పెద్ద ప్రశ్నగా మారింది.

ఏదిఏమైనా జైలర్ 2 చుట్టూ రోజుకో కొత్త వార్త వెలువడుతూ సినిమాపై హైప్‌ను మరింత పెంచుతోంది. పవన్ కళ్యాణ్ నిజంగా ఈ ప్రాజెక్ట్‌లో భాగమవుతారా? లేక ఇది కేవలం ప్రచారమేనా? అనే విషయాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. అయితే ఒకవేళ ఈ కాంబినేషన్ సెట్ అయితే మాత్రం బాక్సాఫీస్ వద్ద నయా రికార్డు క్రియేట్ చేయడం ఖాయం అని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Read more about: jailer 2 pawan kalyan rajinikanth
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X