»   » పవన్ కళ్యాణ్ నెక్ట్స్.... సీక్వెల్ కాదంట, రిమేకేనంట!

పవన్ కళ్యాణ్ నెక్ట్స్.... సీక్వెల్ కాదంట, రిమేకేనంట!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘సర్దార్ గబ్బర్ సింగ్' ఇంకా పూర్తి కానేలేదు ఆయన తర్వాతి సినిమా గురించి రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ నెక్ట్స్ ఖుషి దర్శకుడు ఎస్.జె.సూర్యతో చేయబోతున్నట్లు గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. ఎస్.జె.సూర్య పవన్ తో చేసేది ఖుషి 2కి సీక్వెల్ అనే రూమర్స్ కూడా వినిపించాయి.

అయితే తాజాగ అందుతున్న సమాచారం ప్రకారం..... పవన్-ఎస్.జె. సూర్య కాంబినేషన్లో వచ్చేది ‘ఖుషి-2' కాదని, తమిళంలో హిట్టయిన ‘వేదాళం' చిత్రాన్ని పవన్ హీరోగా రీమేక్ చేయడానికి సూర్య ప్లాన్ చేస్తున్నట్లు టాక్. ఇటీవలే పవన్ కళ్యాన్ ను కలిసిన సూర్య ఈ విషయమై చర్చలు జరిపినట్లు సమాచారం.

Pawan Kalyan in Vedalam remake?

తమిళంలో అజిత్ హీరోగా తెరకెక్కిన ‘వేదాళం' చిత్రం అక్కడ మంచి విజయం సాధించింది. అయితే పవన్ కళ్యాణ్ ఈ ప్రాజెక్టు విషయమై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది తేలాల్సి ఉంది. అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తే తప్ప ఏ విషయం అనేది తేల్చడం కష్టం.

పవన్ ప్రస్తుతం చేస్తున్న...సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా విషయానికొస్తే...బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం సమకూరుస్తున్నారు. 2012లో విడుదలైన ‘గబ్బర్‌సింగ్‌' సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పవన్‌ కల్యాణ్‌ సరసన కాజల్‌ నటిస్తున్నారు. ఈ చిత్రంలో రాయ్‌ లక్ష్మి ఒక ప్రత్యేక గీతంలో ఆడిపాడారు. ఏప్రిల్‌లో ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

English summary
Reports said that, Pawan Kalyan will be working with his Khushi director SJ Surya, latest reports suggests that the said project is the the remake of the Tamil hit Vedalam.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu