అన్న చిరంజీవి విలన్ తో తమ్ముడు పవన్ కల్యాణ్
చిరంజీవి శంకర్ దాదా ఎంబిబియస్ లో నటించిన పరేష్ రావెల్ చాలా కాలం గుర్తుండిపోయారు. కానీ ఆ తర్వాత ఆయనకు తెలుగులో ఆఫర్లు మాత్రం రాలేదు. అయితే ఇప్పుడు ఆయనకు పవన్ కల్యాణ్ తన తాజా చిత్రం తీన్ మార్ లో కీలకమైన పాత్రం ఇచ్చినట్లు సమాచారం. జయంత్ సి.పరాంన్జీ కి కూడా ఆయనతో మంచి పరిచయం ఉండటంతో వెంటనే పరేష్ రావెల్ ఆ పాత్రను ఓకే చేసినట్లు చెప్తున్నారు. పరేష్ రావెల్ గతంలో మనీ చిత్రంలో చేసారు. ఇక తీన్ మార్ చిత్రం పరమేశ్వర ఆర్ట్ పతాకంపై హాస్య నటుడు గణేష్ దీనిని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం ఆడియో మార్చి మొదటి వారంలో భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రాంతానికి చెందిన స్టూడెంట్ గా కనిపంచనున్నారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. త్రిష హీరోయిన్ గా చేస్తోంది. ఈ చిత్రం బాలీవుడ్ హిట్ లవ్ ఆజ్ కల్ కి రీమేక్. త్రివిక్రమ్ రచన చేస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రియల్ 22న విడుదల చేసేందకు ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో దీపికా పదుకోణి కూడా ఓ ఐటం సాంగ్ చేసే అవకాశం ఉందని సమాచారం.


Click it and Unblock the Notifications











