సర్కారు వారి పాట ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిధిగా స్టార్ హీరో.. అప్పుడు మిస్సయ్యారు కానీ ఇప్పుడు కాదట!

మహేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సర్కారు వారి పాట. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా మే నెల 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల అవుతోంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ ను పెద్ద ఎత్తున ప్లాన్ చేసింది సినిమా యూనిట్. ఈ క్రమంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ పెద్ద ఎత్తున జరపనున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఒక బడా స్టార్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు అని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

పరిస్థితి కుదుట పడడంతో

పరిస్థితి కుదుట పడడంతో


కరోనా కారణంగా అనేక సినిమాలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుత పరిస్థితి కుదుట పడడంతో వాయిదా పడిన సినిమాలన్నీ నెమ్మదిగా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.. ఇప్పటికే బడా సినిమాలు కొన్ని బయటకు వచ్చి మంచి హిట్ టాక్ అందుకోగా ఇప్పుడు మహేష్ బాబు హీరోగా నటించిన సర్కార్ వారి పాట సినిమా కూడా విడుదలకు సిద్ధమైంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు గీత గోవిందం దర్శకుడు పరుశురాం దర్శకత్వం వహించారు.

 అంచనాలు మరో స్థాయికి

అంచనాలు మరో స్థాయికి


ఇక అనేక సార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు మే 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉన్న టీజర్ విడుదలవ్వగా తాజాగా విడుదలైన ట్రైలర్ కూడా సినిమా మీద అంచనాలు మరో స్థాయికి తీసుకు వెళ్ళింది.

సోషల్ మీడియాలో వైరల్

సోషల్ మీడియాలో వైరల్


ఈ క్రమంలో ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు చూద్దామా అని మహేష్ అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.. సెన్సషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పాటలు అన్నీ కూడా చార్ట్ బస్టర్ గా నిలిచాయి. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా

త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా


ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మే 7వ తేదీన హైదరాబాద్ లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించబోతున్నారని తెలుస్తోంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే ఆయనతో పాటు మహేష్ బాబు సినిమా దర్శకుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ అతిధిగా

పవన్ కళ్యాణ్ అతిధిగా


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈవెంట్ కోసం హాజరు కావాల్సిందిగా మహేష్ బాబు స్వయంగా కలిసి కోరడంతో పవన్ రావడానికి ఒప్పుకున్నారని తెలుస్తోంది. నిజానికి మెగాస్టార్ చిరంజీవి హీరోగా రామ్ చరణ్ తేజ కీలక పాత్రలో నటించిన ఆచార్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం కూడా పవన్ కళ్యాణ్ నవచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది కానీ అప్పుడు ఆయన రాజకీయ పర్యటనలో ఉండటంతో వేడుకకు హాజరు కాలేదు. రాజమౌళి ముఖ్యఅతిథిగా ఆ వేడుక జరిగింది. ఇక మెగాస్టార్ చిరంజీవి మహేష్ గత చిత్రం సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరయ్యారు. ఇక ఆ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X