అయ్యో... అవి లేనట్లేనా? ‘నా పేరు సూర్య’ మూవీపై పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్?
Recommended Video

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన 'నా పేరు సూర్య-నా ఇల్లు ఇండియా' సినిమా మే 4న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఇటీవల పవన్ కళ్యాణ్ విషయంలో జరిగిన కొన్ని పరిణామాలతో ఈ సినిమా స్పెషల్ షోల విషయంలో ఆంధ్రప్రదేశ్‌లో సమస్య ఏర్పడే అవకాశం ఉందని, స్పెషల్ షోలు ఉండే అవకాశం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలతో మెగా అభిమానుల్లో అయోమయం నెలకొంది. అయితే స్పెషల్ షోస్ కోసం ప్రయత్నాలైతే జరుగుతున్నట్లు సమాచారం.

ఆ రెండు సినిమాలకు పర్మిషన్ ఇచ్చారు
ఇంతకు ముందు విడుదలైన ‘రంగస్థలం', ‘భరత్ అనే నేను' చిత్రాలకు ఏపీలో స్పెషల్ షోల కోసం పర్మిషన్ ఇచ్చారు. ‘రంగస్థలం' చిత్రానికి మార్చి 30 నుండి ఏప్రిల్ 5 వరకు, ‘భరత్ అనే నేను' చిత్రానికి ఏప్రిల్ 20 నుండి ఏప్రిల్ 27 వరకు తెల్లవారు ఝామున 5 గంటల నుండి 10 గంటల మధ్య స్పెషల్ షోస్ వేసుకోవడానికి అనుమతి లభించింది. రంగస్థలం నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్, మహేష్ బాబుకు ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీతో మంచి సంబంధాలు ఉండటం వల్లే ఇది సాధ్యమైందని టాక్.

నా పేరు సూర్య విషయంలో కష్టమేనా?
అయితే ‘నా పేరు సూర్య' విషయంలో ఇది సాధ్యం అయ్యే పని కాదని అంటున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ విషయంలో జరిగిన కొన్ని ఇష్యూలు, టీడీపీని టార్గెట్ చేస్తూ, ఆ పార్టీకి మద్దతుగా ఉన్నాయంటూ కొన్ని టీవీ ఛానల్స్ మీద పవన్ కామెంట్స్.... పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా అల్లు అర్జున్ ఫిల్మ్ చాంబర్ వెల్లడం లాంటి పరిణామాలు ఇందుకు కారణం అనే వాదన వినిపిస్తోంది.

కుట్ర జరుగుతోందని అల్లు అరవింద్ సంచలనం
మరో వైపు... తన కొడుకు సినిమాపై కుట్ర జరుగుతోందని, ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలే అందుకు కారణం అంటూ అల్లు అరవింద్ నా పేరు సూర్య ప్రీ రిలీజ్ ఫంక్షన్ సాక్షిగా బహిరంగ ప్రకటన చేయడం కూడా..... ఏపీలో ‘నా పేరు సూర్య' సినిమా పట్ల ఏర్పడ్డ ప్రతికూల పరిస్థితులకు ఆయన వ్యాఖ్యలు అద్దం పడుతోందని చర్చించుకుంటున్నారు.

తెలంగాణాలో కూడా లేవు
ఇక తెలంగాణలో మెగా ఫ్యామిలీకి ఎలాంటి రాజకీయ పరమైన విబేధాలు లేక పోయినా.... గత సంవత్సర కాలంగా ఇక్కడ బెనిఫిట్ షోలకు ఏ హీరో సినిమా అయినా సరే అనుమతి ఇవ్వడం లేదు. ఇక్కడ కూడా 8 గంటల తర్వాతే షోలు మొదలు కానున్నాయి.


Click it and Unblock the Notifications











