పవన్ కళ్యాణ్, జయంత్ పరాంన్జీ కాంబినేషన్ టైటిల్ ఏమిటీ?

By Srikanya

జయంత్ పరాంన్జీ, పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో లవ్ ఆజ్ కల్ రీమేక్ ని చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఖుషీగా అనే టైటిల్ పెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి డైలాగులు రాస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ దీనిని సజెస్ట్ చేసారని తెలుస్తోంది.పవన్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అయిన ఖుషిని గుర్తు చేస్తూ ఆ ప్లేవర్ లో ఉండే కథ కావటంతో ఈ టైటిల్ పెడితే బావుంటుందని త్రివిక్రమ్ చెప్పారని అంటున్నారు. ఇక ఈ టైటిల్ ని నిర్మాత గణేష్ తమ బ్యానర్ పై ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో ఆల్రెడీ రిజిస్టర్ చేసారు. అయితే అతన్ని టైటిల్ అడిగినట్లు..ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి మొదట నిన్న నేడు..ప్రేమ అనే ట్రూ ట్రాన్స్ లేషన్ టైటిల్ అనుకున్నా వినటానికి విచిత్రంగా ఉందని మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం పవన్..కొమురం పులి పోస్ట్ ప్రొడక్షన్ పనిలో ఉన్నారు. ఇది పూర్తవగానే ఈ ఖుషీగా చిత్రం ప్రారంభం అవుతుంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా ఇలియానా చేయనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X