పవన్ కళ్యాణ్ 'జానీ' చిత్రం స్పూర్తితోనే బాలకృష్ణ..
పవన్ కళ్యాణ్ దర్సకత్వం వహిస్తూ నటించిన "జానీ" అప్పట్లో పెద్ద ప్లాప్ గా నమోదయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడా చిత్రం బాలకృష్ణ కు ప్రేరణగా నిలుస్తోందని చెప్తున్నారు. దాసరి నారాయణ దర్సకత్వంలో రూపొందుతున్న "పరమ వీర చక్ర" చిత్రంలో జానీ చిత్రంలోని ఫైట్స్ ని ప్రేరణగా తీసుకుని ఫైట్స్ ని కంపోజ్ చేయమని రామ్-లక్ష్మణ్ లకు పురమాయించినట్లు సమాచారం. మరీ ప్లాఫ్ చిత్రంలోని పైట్స్ ని తీసుకోవటం ఏమిటి అంటే అవి టెక్నికల్ గా అవుట్ స్టాండిగ్ గా ఉండటమే కారణం అంటున్నారు. అలాగే నిజంగానే ఎదుటివ్యక్తిని కొడుతున్నట్లుగా అనిపించేటట్లు ఫైట్స్ ని పవన్ స్వయంగా శిక్షణ తీసుకుని మరీ రూపొందించారు. ఇక "పరమ వీర చక్ర" చిత్రాన్ని సి.కళ్యాణ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ మేజర్ గానూ, సినిమా హీరోగానూ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. సింహా తర్వాత బాలయ్య నటిస్తున్న చిత్రం కావటంతో పరమవీరచక్ర పై మంచి అంచనాలు ఉన్నాయి. అలాగే దాసరి దర్శకత్వంలో రూపోందుతున్న ఈ సినిమాలో బాలకృష్ణ రావణబ్రహ్మ, కొమరం భీమ్ వంటి ప్రత్యేకమైన గెటప్స్ లో కనిపించనున్నారు.


Click it and Unblock the Notifications











