పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ 2021 టార్గెట్స్.. అభిమానులకు పండగే!
స్టార్ హీరోలు ఏడాదికి ఒక సినిమా చేయడం చాలా కష్టంగా మారింది. కొందరైతే రెండేళ్ల సమయం కూడా తీసుకుంటున్నారు. తొందరపడి సినిమాలు చేయకుండా మంచి సక్సెస్ అందుకోవాలని ఎక్కువ సమయమే తీసుకుంటున్నారు. అయితే ఈ రోజుల్లో ఒకే ఏడాది 2 సినిమాలు చేయడం అనేది మరీంత కష్టంగా మారింది.
కానీ ప్లాన్ చేసుకుంటే మాత్రం తప్పకుండా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేయవచ్చు. అయితే 2021లో పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇదే తరహాలో ఒక ప్లాన్ రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎలాగైనా రెండు సినిమాలను రిలీజ్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారట. పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ వకీల్ సాబ్ ఈ ఏడాది రానున్న విషయం తెలిసిందే. ఇక జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఈ ఏడాది కనిపించే అవకాశం లేదు.

తారక్ నెక్స్ట్ఇయర్ జనవరికి RRR సినిమాతో రాబోతున్నాడు. ఇక ఆ సంవత్సరం చివరలో త్రివిక్రమ్ సినిమాని రిలీజ్ చేయాలని ఎన్టీఆర్ ప్లాన్ చేసుకుంటున్నాడట. ఇక పవన్ కళ్యాణ్... క్రిష్ సినిమాతో పాటు హరీష్ శంకర్ డైరెక్షన్ లో చేస్తున్న సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేయనున్నాడు. ఈ విధంగా మెగా నందమూరి హీరోలు 2021లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచి అభిమానులకు అసలైన పండగ సంతోషాల్ని ఇవ్వనున్నారన్నమాట.


Click it and Unblock the Notifications











