‘కాటమరాయుడు’నైజాం రైట్స్ నితిన్ ఎంతకి తీసుకున్నారు, రిస్క్ ఎంత?

'కాటమరాయుడు' నైజాం డిస్ట్రిబ్యూషన్‌ హక్కులను నితిన్ భారీ రేటుకే సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

By Srikanya

హైదరాబాద్‌: పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ హీరోగా నటిస్తున్న 'కాటమరాయుడు' సినిమా నైజాం డిస్ట్రిబ్యూషన్‌ హక్కులను హీరో నితిన్‌ సొంతం చేసుకున్న తెలిసిందే. అయితే ఎంత రేటుకు ఈ చిత్రం రైట్స్ సొంతం చేసుకున్నారు. వర్కవుట్ అవుతుందా అనే విషయాలు ఇప్పుడు ట్రేడ్ లో హాట్ టాపిక్ గా మారాయి.

ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం..ఈ చిత్రం నైజాం హక్కులు ఇరవై కోట్లకి తీసుకున్నారని తెలుస్తోంది. అలాగే ఆ ఇరవై కోట్లలో రెండు కోట్లు రికవరబుల్‌ అని తెలిసింది. అంటే లెక్క ప్రకారం...ఈ సినిమాపై నితిన్‌ ప్లస్‌ ఏషియన్‌ వాళ్ల రిస్క్‌ పద్ధెనిమిది కోట్లు. సగం ఏషియన్ వాళ్లు షేర్ చుసుకంటారు కనుక నితిన్‌ పై తొమ్మిది కోట్లు రికవరీ భాధ్యత ఉంటుంది. అయితే సినిమా ఓ మోస్తరుగా ... యావరేజ్‌ టాక్ తెచ్చుకున్నా ఈ అమౌంట్‌ తిరిగి వచ్చేస్తుంది.

గతంలో పవన్‌ సినిమాలు గబ్బర్‌సింగ్‌, అత్తారింటికి దారేది రెండూ నైజాంలో అదరగొట్టాయి. అదే స్దాయిలో హిట్టయితే, ఇప్పటి మార్కెట్‌ ప్రకారం నైజాం నుంచే ముప్పయ్‌ కోట్ల షేర్‌ వస్తుంది. భారీగా తేడా వచ్చి సర్దార్ గబ్బర్ సింగ్ స్దాయిలో ..డిజాస్టర్‌ అయితే మాత్రం ఒక నాలుగైదు కోట్లు ఉమ్మడిగా కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి నితిన్ మంచి బిజినెస్ ఆపర్టునిటీని సొంతం చేసుకున్నట్లే.

Pawan Kalyan Katamarayudu Movie Nizam Rights Sold

ఇక 'కాటమరాయుడు' చిత్రం టీజర్‌కు యూట్యూబ్‌లో విశేష స్పందన లభిస్తోంది. 'ఎంత మంది ఉన్నారన్నది ముఖ్యం కాదు.. ఎవడు ఉన్నాడన్నది ముఖ్యం' అంటూ ఫిబ్రవరి 4న విడుదల చేసిన ఈ టీజర్‌ ఇప్పటికీ యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో మొదటి స్థానంలో ఉంది. దాంతో ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుందనే అంచనాలు అంతటా ఉన్నాయి. ముఖ్యంగా నైజాం ఏరియాలో పవన్ కు ఓ రేంజిలో ఫాలోయింగ్ ఉంది. ఖచ్చితంగా నితిన్ కు ఈ సినిమా లాభాలు తెచ్చి పెడుతుందని ట్రేడ్ లో లెక్కలు వేస్తున్నారు.


ఇందులో పవన్‌ ఈ పవర్‌ఫుల్‌ డైలాగ్‌ చెబుతూ కనిపించారు. టీజర్‌లో 'రాయుడూ..' అంటూ వస్తున్న నేపథ్య సంగీతం ఆకట్టుకుంటోంది.
దీంతో అభిమానులు ఈ టీజర్ ను సోషల్ మీడియాలో షేర్ ట్రెండ్ చేస్తూ తెగ సందడి చేస్తున్నారు.

కిశోర్‌ కుమార్‌ పార్థసాని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్‌ హీరోయిన్ . శరత్‌మరార్‌ నిర్మాత. అనూప్‌ రూబెన్స్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఉగాదికి 'కాటమరాయుడు' చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

శ్రుతిహాసన్‌ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం లోని ఇతర ప్రధాన పాత్రలలో ఆలీ, నాజర్, రావు రమేష్, అజయ్, నర్రా శ్రీను, పృథ్వి, శివబాలాజీ, కమల్ కామరాజు, చైతన్య కృష్ణ, తరుణ్ అరోరా, ప్రదీప్ రావత్, పవిత్ర లోకేష్, రజిత, యామిని భాస్కర్, అస్మిత, రమాదేవి, భానుశ్రీ నటిస్తున్నారు. నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై నిర్మిత మవుతున్న ఈ కాటమరాయుడు చిత్రానికి సంగీతం అనూప్ రూబెన్స్, ప్రసాద్ మూరెళ్ళ కెమెరా మన్ గా వర్క్ చేస్తున్నారు. నిర్మాత: శరత్ మరార్ దర్శకత్వం: కిషోర్ పార్ధసాని

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X