»   » చిరు దారిలో పవన్ కళ్యాణ్...చిర్రెత్తిపోతున్న ఫ్యాన్స్!

చిరు దారిలో పవన్ కళ్యాణ్...చిర్రెత్తిపోతున్న ఫ్యాన్స్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా స్టార్ చిరంజీవి 150వ సినిమాగా తమిళంలో హిట్టయిన ‘కత్తి' చిత్రం రీమేక్ లో చేయబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా పవన్ కళ్యాణ్ కూడా ఓ తమిళ చిత్రంపై ఆసక్తి చూపుతున్నట్లు ఫిల్మ్ నగర్లో ప్రచారం జరుగుతోంది. అజిత్ హీరోగా తమిళంలో వచ్చిన ‘వీరమ్' చిత్రం కాన్సెప్టు, స్క్రిప్టు పవన్ కళ్యాణ్ కి బాగా నచ్చిందని, రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు టాక్. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

అయితే పవన్ కళ్యాణ్ తర్వాతి సినిమాలపై గత కొంత కాలంగా రకరకాలుగా ప్రచారం జరుగుతూనే ఉంది. గతంలో పవన్ కళ్యాణ్ ‘గోపాల గోపాల' దర్శకుడు కిషోర్ పార్థసాని చెప్పిన కథకు ఓకే చెప్పినట్లు ప్రచారం జరిగింది. తర్వాత ఆ వార్తతో పాటు దర్శకుడు కనిపించకుండా పోయాడు. కొన్ని రోజులుగా ‘ఖుషి' చిత్రానికి సీక్వెల్ ఎస్ జె సూర్య దర్శకత్వంలో చేయబోతున్నారనే ప్రచారం మొదలైంది. ఇపుడు తెరపైకి తమిళ చిత్రం ‘వీరం' వచ్చింది.

Pawan Kalyan keen to do 'Veeram' remake?

చేతిలో ఉన్న సర్దార్ గబ్బర్ సింగ్ ప్రాజెక్టు పూర్తి చేయడానికే పవన్ కళ్యాణ్ చాలా సమయం తీసుకుంటున్నాడు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా డిసప్పాయింటుతో ఉన్నారు. అసలు సినిమాకే ఇంకా గతి లేదు....తర్వాత సినిమాపై వస్తున్న పుకార్లు విని ఫ్యాన్స్ చిర్రెత్తి పోతున్నారు.

సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా విషయానికొస్తే...బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం సమకూరుస్తున్నారు. 2012లో విడుదలైన ‘గబ్బర్‌సింగ్‌' సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పవన్‌ కల్యాణ్‌ సరసన కాజల్‌ నటిస్తున్నారు. ఈ చిత్రంలో రాయ్‌ లక్ష్మి ఒక ప్రత్యేక గీతంలో ఆడిపాడారు. ఏప్రిల్‌లో ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

పవన్ కళ్యాన్ స్నేహితుడు శరత్ మరార్ ఈ చిత్రానికి నిర్మాత. నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, పవన్‌ కల్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌, ఎరోస్‌ ఇంటర్నేషనల్‌ చిత్రాన్ని రూపొందిస్తున్నాయి. కళ: బ్రహ్మ కడలి, కూర్పు: గౌతంరాజు, పోరాటాలు: రామ్‌ లక్ష్మణ్.

English summary
According to the sources, Pawan Kalyan too is showing interests towards remakes after watching Ajith's movie Veeram.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu