క్లోజ్ ఫ్రెండ్‌కు పవన్ కల్యాణ్ దూరం!.. విభేదాలకు కారణం అదేనా?

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, నిర్మాత శరత్ మరార్ మధ్య ప్రస్తుతం విభేదాలు నెలకొన్నాయనే వార్త ఒకటి మీడియాలోనూ, ఫిలింనగర్‌లోనూ విస్తృతంగా చక్కర్లు కొడుతున్నది.

By Rajababu

Recommended Video

క్లోజ్ ఫ్రెండ్‌కు పవన్ కల్యాణ్ దూరం! కారణం అదేనా?

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, నిర్మాత శరత్ మరార్ మధ్య ఉండే స్నేహం గురించి కొత్తగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. వారి మధ్య స్ట్రాంగ్ ఫ్రెండ్‌షిప్ బాండ్ ఉందనేది అందరికీ తెలిసిందే. కేవలం పవన్ కల్యాణ్‌కు అత్యంత సన్నిహితుడు అని, ఆయనతోనే సినిమాలు తీస్తారనేది టాలీవుడ్‌లో జగమెరిగిన సత్యం.

కానీ అలాంటి స్నేహితుల మధ్య ప్రస్తుతం విభేదాలు నెలకొన్నాయనే వార్త ఒకటి మీడియాలోనూ, ఫిలింనగర్‌లోనూ విస్తృతంగా చక్కర్లు కొడుతున్నది. ఆ విబేధాలు నిజమే అనేంతగా కొన్ని సంఘటనలు బలం చేకూరుస్తున్నాయి. అవేమిటంటే..

శరత్ మరార్ లేకపోవడం

శరత్ మరార్ లేకపోవడం

సాధారణంగా పవన్ కల్యాణ్ ఏ కార్యక్రమం చేపట్టినా అక్కడ శరత్ మరార్ తప్పక ఉంటాడు. కానీ ఇటీవల జనసేన చీఫ్‌గా పవన్ కళ్యాణ్ తన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన సమయంలో తన మిత్రుడు శరత్ మరార్ కనిపించకపోవడం ఓ చర్చకు దారి తీసింది.

 త్రివిక్రమ్, ఆలీ వచ్చారు.. కానీ

త్రివిక్రమ్, ఆలీ వచ్చారు.. కానీ

పార్టీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పవన్ సన్నిహితులని ముద్ర పడిన వారంతా కనిపించారు. త్రివిక్రమ్, అలీ, నిర్మాత సురేష్ బాబు, సినిమా పరిశ్రమకు చెందని పవన్ సన్నిహితులు హాజరయ్యారు. కానీ శరత్ మరార్ మాత్రం ఈ కార్యక్రమంలో కనిపించకపోవడంతో అనేక అనుమానాలు తలెత్తాయి.

 కాటమరాయుడు చిచ్చు..

కాటమరాయుడు చిచ్చు..

అయితే పవన్ కల్యాణ్, శరత్ మారార్ మధ్య సర్దార్ గబ్బర్‌సింగ్, కాటమరాయుడు చిత్రాలు చిచ్చు పెట్టాయన్నది ఓ మీడియా కథనం. ఆయా చిత్రాల ఆర్థిక వ్యవహారాల కారణంగా విభేదాలు నెలకొన్నట్టు ప్రచారం జరిగుతున్నది.

 డిస్టిబ్యూటర్స్‌తో ప్రాబ్లెమ్స్

డిస్టిబ్యూటర్స్‌తో ప్రాబ్లెమ్స్

కాటమరాయుడు చిత్రం దారుణంగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడం, ఆ తర్వాత పంపిణీదారుల గొడవపెట్టడం జరిగింది. అయితే డిస్ట్రిబ్యూటర్ల సెటిల్మెంట్ విషయంలో తగిన విధంగా స్పందించలేదనే కారణంతో పవన్, శరత్ మధ్య గొడవ జరిగిందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది.

 శరత్ మరార్ హాజరై..

శరత్ మరార్ హాజరై..

పవన్‌తో విభేదాలు లేకుంటే పార్టీ ప్రారంభోత్సవ వేడుకకు హాజరై ఉండేవాడు కాదా? వారి మధ్య విభేదాల కారణంగానే శరత్ హాజరుకాలేదు అనే ప్రశ్నలు ఫిలింనగర్‌లో వినిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X