పవన్ - క్రిష్ సినిమా వివరాలు లీక్: హీరోయిన్‌గా ఆ దేశం నటి.. కొత్త టైటిల్.. అనసూయ రోల్ బయటకు!

సుదీర్ఘ విరామం తర్వాత 'వకీల్ సాబ్'తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. వచ్చే ఎన్నికల నాటికి వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలని భావిస్తోన్న అతడు.. వరుసగా భారీ ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నాడు. ఇందులో భాగంగానే టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడితో ఓ సినిమా చేస్తున్నాడు. ఏఎమ్ రత్నం నిర్మిస్తోన్న ఈ మూవీ షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు పెట్టబోతోన్న టైటిల్, ఇందులో పవన్ చేస్తోన్న రోల్, అనసూయ పాత్ర సహా మిగిలిన వివరాలన్నీ లీకైపోయాయి. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

తొలిసారి అలాంటి సినిమాలో పవన్ కల్యాణ్

తొలిసారి అలాంటి సినిమాలో పవన్ కల్యాణ్

దాదాపు ఇరవై ఏళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోగా వెలుగొందుతున్నాడు పవన్ కల్యాణ్. సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో తరహా సినిమాలను చేశాడు. ఇందులో భాగంగానే క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో.. కెరీర్‌లోనే మొదటిసారిగా పిరియాడిక్ జోనర్‌లో సినిమా చేస్తున్నాడు పవర్ స్టార్. మొగల్ సామ్రాజ్యం నాటి కథతో రూపొందుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి.

కెరీర్‌లో భారీ బడ్జెట్‌తో.. ఆ రోల్ చేస్తున్నాడు

కెరీర్‌లో భారీ బడ్జెట్‌తో.. ఆ రోల్ చేస్తున్నాడు

క్రిష్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ నటిస్తోన్న ఈ సినిమాను దాదాపు రూ. 180 కోట్లతో రూపొందిస్తున్నారని ఓ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఏఎమ్ రత్నం దీన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారని అంటున్నారు. ఇక, ఇందులో పవర్ స్టార్.. వజ్రాల దొంగగా నటిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే కోహినూర్ డైమెండ్‌ను కూడా చూపిస్తారని తెలుస్తోంది.

పవర్ స్టార్ అవన్నీ.. లుక్‌లో కూడా సరికొత్తగా

పవర్ స్టార్ అవన్నీ.. లుక్‌లో కూడా సరికొత్తగా

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాలో పవన్ కల్యాణ్ పాత్ర ఎంతో కొత్తగా ఉంటుందట. ఈ మూవీ కోసం అతడు గుర్రపు స్వారీతో పాటు కత్తి, కర్రసాములు కూడా చేయబోతున్నాడని అంటున్నారు. అంతేకాదు, అతనకెంతో ఇష్టమైన గన్ షూటింగ్ కూడా ఇందులో ఉంటుందని తెలుస్తోంది. ఇక, లుక్ పరంగా ఈ మూవీలో పవన్ విగ్గుతో కనిపించబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది.

అనుకున్నది కాదు.. వేరే టైటిల్ ఫిక్స్ చేశారు

అనుకున్నది కాదు.. వేరే టైటిల్ ఫిక్స్ చేశారు

పిరియాడిక్ జోనర్‌లో రాబోతున్న ఈ సినిమాకు 'విరూపాక్ష' అనే టైటిల్ ఫిక్స్ చేస్తున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అయితే, ఆ మధ్య దీని స్థానంలో 'ఓం శివమ్' అనే పేరు పెడుతున్నట్లు ప్రచారం జరిగింది. ఇక, ఈ మధ్య 'హర హర వీరమల్లు' అనే టైటిల్ పరిశీలనలో ఉందని అన్నారు. తాజా సమాచారం ప్రకారం.. దీన్నే ఫిలిం చాంబర్‌లో రిజిస్టర్ చేయించారట.

 హీరోయిన్‌గా శ్రీలంకన్ బ్యూటీ.... నిధి అదనం

హీరోయిన్‌గా శ్రీలంకన్ బ్యూటీ.... నిధి అదనం

భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాలో శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో ఆమె చేసేది ఓ ప్రిన్సెస్ పాత్ర అని సమాచారం. అలాగే, ఈ చిత్రంలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ కూడా నటిస్తున్నట్లు ఇటీవలే బయటకు వచ్చింది. అంతేకాదు, తాజాగా జరిగిన షెడ్యూల్‌లో పవన్.. ఆమె మధ్య కొన్ని కీలక సన్నివేశాలు కూడా చిత్రీకరించారు.

Recommended Video

KGF Chapter 2 : Yash & Prashant Neel Plans For a Powerful Climax
అనసూయ ఐటెం సాంగ్ కాదు.. కీలక పాత్రలో

అనసూయ ఐటెం సాంగ్ కాదు.. కీలక పాత్రలో

ఇక, ఈ సినిమాలో తెలుగు బుల్లితెర యాంకర్ అనసూయ స్పెషల్ సాంగ్ చేయబోతుందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఆమె ఈ సినిమాలో చేసేది స్పెషల్ సాంగ్ కాదట. అంతేకాదు, అనసూయ ఈ సినిమాలో కీలకమైన పాత్రను పోషిస్తుందని తెలిసింది. దాదాపు 30 నిమిషాల పాటు ఉండే ఈ రోల్ సినిమాకే హైలైట్ అవుతుందని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X