అప్పుడు అబ్బాయ్ ఇప్పుడు బాబాయ్.. పవన్ కళ్యాణ్‌ హీరోయిన్ ఫిక్స్.. భారీ ఆఫర్

పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల జోరు పెంచేశారు. ఇప్పటికే 'పింక్' రీమేక్ షూటింగ్‌లో షూటింగ్‌లో బిజీగా ఉన్న ఆయన.. ఇటీవలే క్రిష్ దర్శకత్వంలోనూ మరో సినిమా స్టార్ట్ చేసేశారు. దీంతో ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరికీ ఛాన్స్ ఇస్తారనే దానిపై చర్చలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా హీరోయిన్ విషయమై ఆసక్తికర వార్త బయటకొచ్చింది. వివరాల్లోకి పోతే..

పవన్ పవర్‌ఫుల్ స్కెచ్.. వరుస కమిట్మెంట్స్

పవన్ పవర్‌ఫుల్ స్కెచ్.. వరుస కమిట్మెంట్స్

నిర్మాతల కోరిక, గతంలో ఆయన ఇచ్చిన కొన్ని కమిట్మెంట్స్ మేరకు తిరిగి వెండితెరపై కాలుమోపారు పవన్. ఈ మేరకు ఇటు సినిమాలతో పాటు అటు రాజకీయాల్లో చురుకుగా ఉండేలా పవర్‌ఫుల్ స్కెచ్ వేసుకున్నారట ఆయన. ఈ నేపథ్యంలోనే వరుస సినిమాలకు కమిట్ అవుతున్నారు.

 హీరోయిన్‌పై స్పెషల్ ఫోకస్

హీరోయిన్‌పై స్పెషల్ ఫోకస్

ఇటీవలే క్రిష్ దర్శకత్వంలో కొత్త సినిమా స్టార్ట్ చేసేసి తన సినిమాల స్పీడు పెంచేశాడు పవన్. క్రిష్ చెప్పిన కథకు ఫిదా అయిన పవన్, ఈ సినిమా చేయడానికి వెంటనే ఒప్పుకున్నాడట. చకచకా పనులు కావాలని చెప్పేయడంతో ఇందులో నటించే హీరోయిన్ ఎంపికపై స్పెషల్ ఫోకస్ పెట్టారట క్రిష్.

ప్రగ్యా జైస్వాల్ అనుకుంటే తెరపైకి కియారా..

ప్రగ్యా జైస్వాల్ అనుకుంటే తెరపైకి కియారా..

మొదట ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రగ్యా జైస్వాల్ పేరును పరిశీలిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ తాజాగా కియారా అద్వాని పేరు తెరపైకి రావడంతో మెగా అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. గతంలో ఇదే మెగా హీరో రామ్ చరణ్ సరసన 'వినయ విధేయ రామ' సినిమాలో నటించి భేష్ అనిపించుకుంది కియారా.

ఒప్పుకోవాలే గానీ.. భారీ ఆఫర్

ఒప్పుకోవాలే గానీ.. భారీ ఆఫర్

ప్రస్తుతం కోయరాతో సంప్రదింపులు జరుపుతున్నారట క్రిష్. ఆమె ఒప్పుకోవాలే గానీ భారీ రెమ్మ్యూనరేషన్ కూడా ఆఫర్ చేసేందుకు సిద్దమయ్యారట. ఇకపోతే కియారా బాలీవుడ్లో భారీ సినిమాలతో బిజీగా ఉన్న కారణంగా పవన్‌తో నటించేందుకు రెడీ అవుతుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.

బందిపోటుగా పవన్

బందిపోటుగా పవన్

పవన్ కోసం చారిత్రక నేపథ్యంతో కూడిన కథను సిద్ధం చేసుకున్నాడు క్రిష్. ఆంగ్లేయుల పరిపాలనా కాలం కంటే ముందు కథతో ఈ సినిమా రూపొందిస్తున్నారట. ఇందులో పవన్ ఓ బందిపోటుగా కనిపించనున్నాడని టాక్.

 రాజకీయాల షెడ్యూల్స్‌కి అనుగుణంగా ప్లాన్

రాజకీయాల షెడ్యూల్స్‌కి అనుగుణంగా ప్లాన్

మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఈ సినిమా షూటింగ్‌ను కంగారుగా కాకుండా పవన్ రాజకీయాల షెడ్యూల్స్‌కి అనుగుణంగా ప్లాన్ చేస్తున్నారట క్రిష్. గతేడాది ఎదుర్కొన్న పరాజయాలను పవన్ సినిమాతో మరిపించాలని ఆయన జాగ్రత్త పడుతున్నారట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X