పవన్-క్రిష్ మూవీ అప్‌డేట్.. చివరకు ఆ హీరోయిన్ ఫిక్స్.. అదే జరిగితే!

ఇన్నాళ్లు రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల జోరు పెంచేశారు. ఇప్పటికే 'పింక్' రీమేక్ షూటింగ్‌లో షూటింగ్‌లో బిజీగా ఉన్న ఆయన.. ఇటీవలే క్రిష్ దర్శకత్వంలోనూ మరో సినిమా స్టార్ట్ చేసేశారు. దీంతో ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారనే దానిపై చర్చలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా హీరోయిన్ విషయమై ఆసక్తికర వార్త బయటకొచ్చింది.

పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనున్న ఈసినిమాలో పవన్ బందిపోటుగా కనిపించనున్నాడని సమాచారం. అయితే ఈ చిత్రంలో పవన్ హీరోయిన్ విషయమై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్న క్రిష్.. ముందుగా 'కంచె' సినిమా హీరోయిన్ ప్రగ్య జైస్వాల్ ని పరిశీలించారు. ఆ తర్వాత కియారా అద్వాని పేరు తెరపైకి వచ్చింది. కానీ తాజా సమాచారం మేరకు ఈ ఇద్దరూ కాదని కీర్తి సురేష్ వైపు మొగ్గు చూపుతున్నారట క్రిష్.

Pawan Kalyan- Krish movie: Keerthy Suresh selected as heroine

గతంలో ఇదే కీర్తి సురేష్ అజ్ఞాతవాసి సినిమాలో పవన్ సరసన నటించి భేష్ అనిపించుకుంది. ఇక మహానటి సినిమాతో ఏకంగా జాతీయ అవార్డులనే కైవసం చేసుకొని దేశ వ్యాప్త క్రెడిట్ కొట్టేసింది. ఈ సినిమాపై ఉన్న హైప్‌కి కీర్తి సురేష్ క్రెడిట్ కూడా తోడు కావాలని భావించి క్రిష్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్. ఏ. ఎం.రత్నం రూపొందిస్తున్న ఈ సినిమా షూటింగ్ అతిత్వరలో ప్రారంభం కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X