పవన్ కళ్యాణ్, క్రిష్ ప్రాజెక్ట్.. ఆ విషయంలో మరో చిన్న మార్పు?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ విడుదలకు సిద్దమవుతున్న విషయం తెలిసిందే. ఇక ఆ మూవీ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయ్యప్పనుమ్ కొశీయుమ్ రీమేక్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఆ సినిమా కోసం కేవలం 40రోజుల కాల్షీట్స్ ఇస్తున్నాడు పవన్. ఇక క్రిష్ దర్శకత్వంలో కూడా పిరియాడిక్ స్టోరీలో నటించబోతున్న విషయం తెలిసిందే.

అప్పట్లో ఆ సినిమా కోసం పవన్ కోర మీసాలు పొడవు జుట్టు కూడా పెంచాడు. అయితే లాక్ డౌన్ కారణంగా ప్లాన్స్ మొత్తం చేంజ్ అయ్యాయి. ఇక పవన్ వకీల్ సాబ్ కోసం లుక్ కూడా మార్చల్సి వచ్చింది. లేకుంటే ఈపాటికె ఆ సినిమా షూటింగ్ పూర్తయ్యేది. ఇక ఆ సినిమాకు సంబంధించిన టైటిల్స్ పై రకరకాల రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే. విరూపాక్ష, శివం, గజదొంగ, హర హర మహాదేవ్, బందిపోటు వంటి పేర్లు వినిపించాయి.

Pawan kalyan krish movie latest update on title changes

ఎక్కువగా ఇటీవల హరిహర వీరమల్లు అనే టైటిల్ ను ఆల్ మోస్ట్ ఫిక్స్ చేసినట్లు టాక్ వచ్చింది. కానీ ఆ టైటిల్ విషయంలో కూడా చిన్నపాటి మార్పులు చేస్తారని తెలుస్తోంది. కేవలం 'వీరమల్లు' అని టైటిల్ ను ఫిక్స్ చేయవచ్చని రూమర్స్ వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని త్వరలోనే ఒక స్పెషల్ అప్డేట్ ఇవ్వనున్నట్లు సమాచారం.చూడాలి మరి ఈ రూమర్ ఎంతవరకు నిజమవుతుందో..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X