పవన్ ఆలస్యం చేసినా నో ప్రాబ్లమ్.. డైరెక్టర్ క్రిష్ న్యూ టార్గెట్
ఒక సినిమా సెట్స్ పైకి వచ్చింది అంటే వీలైనంత తొందరగా ఫినిష్ చేస్తేనే బావుంటుందని అనుకుంటారు చిత్ర యూనిట్ సభ్యులు. ముఖ్యంగా ఈ రోజులల్లో దర్శకులు ఒక సినిమా పూర్తయితే గాని మరో సినిమా స్టార్ట్ చేయడం లేదు. కానీ దర్శకుడు క్రిష్ మాత్రం అందుకు భిన్నంగా అడుగులు వేస్తున్నాడు. అసలు మ్యాటర్ లోకి వస్తే క్రిష్, పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.
ఆ సినిమాకు వీరూపాక్ష అనే వర్కింగ్ టైటిల్ ని కూడా ఎప్పుడో సెట్ చేశారు. షూటింగ్ స్టార్ట్ చేసిన కొన్ని రోజులకే లాక్ డౌన్ దెబ్బ పడడంతో వాయిదా వేయక తప్పలేదు. ఇక దర్శకుడు క్రిష్ కూడా పవన్ సిద్ధంగా లేకపోవడంతో రిస్క్ చేసి మరీ మరో సినిమాను సెట్స్ పైకి తెచ్చాడు. వైష్ణవ్ తేజ్ సినిమాను ఆల్ మోస్ట్ ఫినిష్ కూడా చేశాడు. అయితే పవన్ ఇప్పుడు అయ్యప్పన్ కొశీయుమ్ రీమేక్ ను నెల రోజుల్లో లేదా 40రోజుల్లో పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్న విషయం తెలిసిందే.

అయితే ఆ సినిమా అయిపోయిన తరువాతనే క్రిష్ సినిమా షూట్ లో పాల్గొంటాడట పవన్. ఇక పవన్ ఎంత ఆలస్యం చేసినా కూడా క్రిష్ పెద్దగా ఇబ్బంది పడటం లేదట. స్క్రిప్ట్ లో ఇంకొన్ని మార్పులు చేసుకొని షూటింగ్ ని ఇంకాస్త ఫాస్ట్ గా ఫినిష్ చేసుకునేలా ప్లాన్ రెడీ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. పవన్ డేట్స్ దొరకాలి అంటే మరో నాలుగు నెలల టైమ్ పడుతుందట. ఇక క్రిష్ కూడా అప్పటి లోపు వైష్ణవ్ తేజ్ సినిమాను రిలీజ్ చేసి పవన్ సినిమాపై ఫోకస్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











