Don't Miss!
- News ఆ ఘటన కలచివేసింది: వైసీపీ సోషల్ మీడియా భేటీలో జగన్: విశాఖ కేంద్రంగా
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
- Finance IPO News: ఐపీవో బంపర్ లిస్టింగ్.. తొలిరోజే అప్పర్ సర్క్యూట్ తాకి భారీ లాభాలు.. కొన్నారా..
- Automobiles ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
పవన్ కళ్యాణ్, క్రిష్ బిగ్ బడ్జెట్ మూవీ...మళ్ళీ ఎప్పుడు మొదలవుతుందంటే?
హిస్టారికల్ బిగ్ బడ్జెట్ సినిమాలను కూడా చాలా వేగంగా పూర్తి చేయగల దర్శకుడు క్రిష్. గౌతమి పుత్ర శతకర్ణి సినిమాను కూడా చాలా తక్కువ సమయంలో పూర్తి చేశారు. అలాంటి చారిత్రాత్మక సినిమాను క్రిష్ పక్కా ప్లాన్ తో దాదాపు ఆరు నెలల్లోనే పూర్తి చేసి మళ్ళీ రెగ్యులర్ ప్రమోషన్స్ కూడా చేశాడు. క్రిష్ పనితనానికి దర్శకుడు రాజమౌళి కూడా షాక్ అయ్యాడు. సినిమా మంచి రిజల్ట్ ని అందుకోవడంతో దర్శకుడి స్థాయి పెరిగింది.
ఇక ఇప్పుడు అదే తరహాలో పవన్ కళ్యాణ్ తో చేస్తున్న పిరియాడిక్ డ్రామా విరూపాక్ష కూడా వీలైనంత తొందరగా ఫినిష్ చేయాలని అనుకుంటున్నాడు. అసలైతే కరోనా వైరస్ లాక్ డౌన్ గోల లేకుంటే ఈపాటికే ఆ సినిమా షూటింగ్ అయిపోయేది. కానీ పవన్ కళ్యాణ్ అప్పుడు వర్క్ చేయలేనని చెప్పడంతో క్రిష్ మరో సినిమాను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ తో ఒక సినిమాను స్టార్ట్ చేసిన క్రిష్ ఆ సినిమాను నవంబర్ మొదటి వారంలోగా పూర్తి చేయనున్నాడు.
ఇక పవన్ కళ్యాణ్ ప్రాజెక్టును నవంబర్ లోనే స్టార్ట్ చేయాలని పక్కా ప్లాన్ తో సిద్ధమవుతున్నట్లు టాక్. కుదిరితే కేవలం మూడు నెలల్లోపే ఫ్యాకప్ చెప్పేసే విధంగా రెడీ అవుతున్నాడు. కానీ అదంతా జరగాలి అంటే పవన్ కళ్యాణ్ చేతుల్లోనే ఉంది. ఆయన డేట్స్ ఇతర కారణాల వల్ల మిస్సయితే అలస్యమవ్వక తప్పదు. ఇప్పటికే పింక్ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్న పవర్ స్టార్ మిగతా ప్రాజెక్టులను కూడా ఒకేసారి సెట్స్ పైకి తేవాలని చూస్తున్నాడు. మరి ఈ ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో తెలియదు గాని విరూపాక్ష షూటింగ్ మాత్రం నవంబర్ ఊపందుకునే ఛాన్స్ ఉన్నట్లు టాక్.