»   » సొంతగా టీవీ చానల్, న్యూస్ పేపర్.... పవన్ స్పందన!

సొంతగా టీవీ చానల్, న్యూస్ పేపర్.... పవన్ స్పందన!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'జనసేన' పేరుతో రాజకీయ పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజకీయాలపై అంతగా ఫోకస్ పెట్టలేదు. సినిమాలు చేస్తూ కాలం గడిపిస్తున్నారు. అయితే 2019 ఎన్నికల నాటికి పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వెలుతున్నారని, ప్రస్తుత రోజుల్లో రాజకీయాల్లో విజయవంతంగా కొనసాగించాలంటే సొంత మీడియా ఉండాలనే ఉద్దేశ్యంతో ఓ న్యూస్ పేపర్, టీవీ చానల్ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది.

ఈ విషయం పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లగా......ఈ రూమర్స్ విని నవ్వుకున్నారని ఆయన సన్నిహితులు అంటున్నాు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన ఫోకస్ అంతా సినిమాల మీదనే పెట్టారని, ఈ కమిట్మెంట్లు పూర్తయిన తర్వాతే ఆయన రాజకీయాలపై దృష్టి పెడుతారని అంటున్నారు.

Pawan Kalyan

పవన్ కళ్యాణ్ చాలా మొహమాటం గల వ్యక్తి.....సొంతగా టీవీ ఛానళ్లు, పేపర్లు పెట్టుసుకుని రాజకీయాలు చేసుకునే ఉద్దేశ్యం ఆయనకు లేదు. జనం కోసమే పార్టీ పెట్టారు తప్ప...ఆయన స్వార్థం కోసం కాదు అని అంటున్నారు. ఇవన్నీ కేవలం రూమర్స్ మాత్రమే అని కొట్టిపారేస్తున్నారు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన తర్వాతి సినిమాకు సిద్ధమవుతున్నారు. 'ఖుషి' దర్శకుడు ఎస్.జె.సూర్య దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతోంది. చాలా గ్యాప్ తర్వాత ఈ ఇద్దరూ కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. నార్త్ స్టార్ ఎంటర్టెన్మెంట్స్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

English summary
Actor-politician Pawan Kalyan has laughed off the rumours of him floating a TV Channel, newspaper to support his political ambitions.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu