తీన్ మార్ సినిమాలో త్రిషతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లిప్ లాక్
బాలీవుడ్‌లో ఘనవిజయం సాధించిన ప్రేమకథా చిత్రం 'లవ్ ఆజ్ కల్"ను తెలుగులో పవన్‌కళ్యాణ్, త్రిషలతో 'తీన్‌మార్" పేరుతో తెరకెక్కిస్తున్నారనే విషయం తెలియగానే అందరిలోనూ ఓ సందేహం కలిగింది. 'లవ్ ఆజ్ కల్"లో సైఫ్ అలీఖాన్, దీపికా పదుకొనేల మధ్య అరడజను పైగా లిప్‌లాక్ సన్నివేశాలుంటాయి. మరి, తెలుగు వెర్షన్‌లో అలాంటి సన్నివేశాలుంటాయా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూశారు. అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఆది నుంచి ఇలాంటి వాటికి దూరంగా వుండే పవన్ తొలిసారిగా ఈ చిత్రంలో త్రిషతో లిప్‌లాక్ చేశారని సమాచారమ్.
షూటింగ్ ప్రారంభంలో ఆ సన్నివేశాలకు అంగీకరించని పవన్‌కళ్యాణ్‌ను దర్శకుడు జయంత్ కథలోని ప్రాముఖ్యతను వివరించి ఒప్పించారట. హీరోయిన్ త్రిష కూడా కథ పరంగా సన్నివేశం డిమాండ్ చేసింది కాబట్టి అందులో తప్పు లేదని అంగీకరించారట. ఈ నేపథ్యంలో పవన్, త్రిషల మధ్య ముద్దు దృశ్యాలు కూడా వుంటే అది అదనపు ఆకర్షణే అవుతుంది. ఆ విషయమై తెలియాలంటే సినిమా విడుదలయ్యే దాకా ఆగాల్సిందే. ఈ సినిమా ఈ నెల 14 వరకు విడుదలవుతోంది.


Click it and Unblock the Notifications











