twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కళ్యాణ్ 'లవ్ లీ' చిత్రానికి మరో కాపీ దెబ్బ?

    By Srikanya
    |

    సిద్దార్ధ "బావ" చిత్రంలో పవన్ కళ్యాణ్ తాజాగా "లవ్ లీ" టైటిల్ తో రీమేక్ చేస్తున్న "లవ్ ఆజ్ కల్" లోని హైలెట్ గా నిలిచే మెయిన్ ధీమ్ ని లేపేసి వాడుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి అలాంటి సమస్యే ఇదే "లవ్ లీ" చిత్రానికి ఎదురౌనుందని తెలుస్తోంది. తమిళంలో ఆర్య, శ్రియ కాంబినేషన్ లో క్రితం శుక్రవారం విడుదలైన "చిక్కు బుక్కు" చిత్రంలో "లవ్ ఆజ్ కల్" చిత్రంలోని స్క్రీన్ ప్లేని, సీన్స్ ని దాదాపు అరవై శాతం వరకూ ఎత్తేసారు. అలాగే ఈ చిత్రం తెలుగులోకి డబ్బింగ్ అవబోతోందని తెలుస్తోంది. దాంతో "చిక్కు బుక్కు" చూసిన ప్రేక్షకులు..పవన్ "లవ్ లీ" చిత్రాన్ని ఎంతవరకూ కొత్తగా ఫీలవతారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అఫీషియల్ గా చిత్రం రైట్స్ ని తీసుకుని రీమేక్ చేస్తున్న నేపధ్యంలో ఇలాంటి ఫ్రీమేక్ లు నిజంగా ఓ పెద్ద సమస్యే. కాశీ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం న్యూజిలాండ్ ‌లో ఓ భారీ షెడ్యూల్ జరపనున్నారు. ఈ చిత్రానికి మాటలు: త్రివిక్రమ్, సంగీతం: మణిశర్మ. పవన్ ‌కళ్యాణ్ సరసన త్రిష, కృతికర్బందా హీరోహీరోయిన్లుగా పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో నటుడు గణేష్‌ బాబు నిర్మిస్తున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X