ఆ ముగ్గురికి పవన్ కళ్యాణ్ లవ్లీ పై టెన్షన్ టెన్షన్...!?
'కొమరం పులి"తో డిజప్పాయింట్ అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంతో పట్టుదలతో డెఫినెట్ గా హిట్ కొట్టాలన్న కసితో చేస్తున్న 'లవ్లీ"కి కొత్త ప్రాబ్లమ్ వచ్చింది. జయంత్ దర్శకత్వంలో గణేష్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రం హిందీ సూపర్ హిట్ మూవీ'లవ్ ఆజ్ కల్" కి రీమేక్ అన్న విషయం తెలిసిందే. అయితే లవ్ ఆజ్ కల్ కి రీమేక్ గా రూపొందిన తమిళ సినిమా 'చికుబుకు" ఇటీవలే విడుదలైంది. ఆర్య, శ్రియ జంటగా నటించిన ఈ చిత్రం లవ్ ఆజ్ కల్ కథతో, జబ్ వియ్ ట్రీట్ మెంట్ తో రూపొందింది. తెలుగులో ఈ మధ్య వచ్చిన 'బావ"లో లవ్ ఆజ్ కల్ చిత్రంలోని ఒక ఇంపార్టెంట్ ఎపిసోడ్ ని కాపీ చేసేశారు.
తమిళంలో రిలీజ్ అయిన 'చికుబుకు" చిత్రాన్ని తెలుగులోనూ డబ్ చేస్తున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ సినిమాకి భారీ డ్యామేజ్ జరిగే అవకాశముంది. ఎందుకంటే సినిమాలోని సీన్లు, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ను పూర్తిగా కాపీ చేసేశారు. ఏం చేయాలో తోచక నిర్మాత గణేష్ బాబు తలపట్టుకున్నాడు. హిట్లు లేక బాధపడుతున్న జయంత్ కి, హిట్ తప్పనిసరి అయిన పవన్ కళ్యాణ్ కి, నిర్మాతగా బ్రేక్ కోసం చూస్తున్నగణేష్ బాబుకి 'లవ్లీ" చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. మరి ఈ సినిమా ఈ ముగ్గురి భవిష్యత్తును ఎలా మార్చనుందో..


Click it and Unblock the Notifications











