Devara Pre Release Event: ఒకే వేదికపైకి పవన్ , మహేశ్ , ఎన్టీఆర్.. దేవర ప్రీ రిలీజ్‌ ఈవెంట్ కోసం భారీ స్కెచ్ !

తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్ద సినిమా ఈవెంట్స్ జరిగి చాలా కాలమే అవుతోంది. గతంలో అవార్డు ప్రదానోత్సవాలు, సన్మానాలు, సత్కారాలు జోరుగా జరిగేవి. చిత్ర సీమలో ఉన్న చిన్నా పెద్దా నటులు అంతా ఒకే వేదికపైకి వచ్చేవారు. కానీ ఈ మధ్యకాలంలో అలాంటివి తగ్గుతున్నాయి. కొద్దిరోజుల క్రితం జరిగిన నందమూరి బాలకృష్ణ 50 ఇయర్స్ ఈవెంట్‌కు టాలీవుడ్ మొత్తం కదిలొచ్చింది. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ సినిమా కారణంగా మరోసారి తారలు ఒక చోటికి చేరబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

కొరటాల శివ- జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న దేవర సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఈ మూవీ ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. బాలీవుడ్ స్టార్స్ జాన్వీ కపూర్‌, సైఫ్ అలీ ఖాన్‌లు దేవర ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో దేవరపై భారీ అంచనాలున్నాయి.

pawan kalyan mahesh babu to share screen space with jr ntr for Devara Pre Release Event here s the details

సెప్టెంబర్ 10న ముంబైలో ట్రైలర్ లాంచ్ కార్యక్రమం జరిగింది. దేవర‌కు సీబీఎఫ్‌సీ బోర్డ్ యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ మూవీ రన్ టైమ్ విషయానికి వస్తే 2 గంటల 57 నిమిషాల 58 సెకన్లు. దేవరను యువసుధ ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై మిక్కిలినేని సుధాకర్ , నందమూరి కళ్యాణ్‌రామ్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది.

మేకర్స్ ప్రమోషన్స్‌కు తోడు ప్రీ రిలీజ్ బిజినెస్‌లో దేవర రికార్డులు అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. అలాగే అమెరికాలోని లాస్ ఏంజెల్స్ నగరంలో జరగనున్న 'బియాండ్ ఫెస్ట్'లో ఎన్టీఆర్ మూవీ స్క్రీనింగ్ కానుంది.సెప్టెంబర్ 26న ఈజిప్టియన్ థియేటర్‌లో దేవర ప్రదర్శన జరగనుండగా.. హాలీవుడ్ సెలబ్రెటీలు దేవరను వీక్షించనున్నారు. ఈ న్యూస్‌తో దేవరపై భారీ హైప్ నెలకొంది. దీనికి మరింత బూస్టప్ ఇచ్చేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

pawan kalyan mahesh babu to share screen space with jr ntr for Devara Pre Release Event here s the details

దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించాలని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారు. సెప్టెంబర్ 22న హైదరాబాద్‌లోని నోవాటెల్‌ వేదికగా ఈ కార్యక్రమం జరగనుందని టాలీవుడ్ టాక్. తొలుత ఈ ఈవెంట్‌ను ఏపీలో నిర్వహించాలని భావించగా.. బెజవాడలో వరదల నేపథ్యంలో వేదిక మారినట్లుగా వార్తలు వస్తున్నాయి. దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కోసం ఏపీ డిప్యూటీ సీఎం, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్‌స్టార్ మహేశ్ బాబులు చీఫ్ గెస్ట్‌లుగా రానున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

ఎన్టీఆర్‌తో ఉన్న అనుబంధం నేపథ్యంలో ఈ ఇద్దరూ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు రావడానికి అంగీకరించినట్లుగా ఫిలింనగర్ టాక్. ఒకే వేదికపై ఎన్టీఆర్, పవన్, మహేశ్ ఉంటే చూడటానికి రెండు కళ్లు చాలవు. ఇది సినిమాకు కూడా బాగా వర్కవుట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. మరి ఈ ప్లాన్ ఎంత వరకు వర్కవుట్ అవతుందో, అసలు మహేశ్, పవన్‌లు దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వస్తారో లేదో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Read more about: pawan kalyan mahesh babu devara
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X