పవన్ కల్యాణ్‌తో నటించడానికి ఆ హీరోలు సిద్ధమే.. కానీ?
టాలీవుడ్ లో చాలా కాలం తరువాత మళ్ళీ మల్టీస్టారర్ సినిమాల హవా మొదలైంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా కెరీర్ లో రెండవసారి మరో ఇంట్రెస్టింగ్ మల్టీస్టారర్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక మళయాళం కథలో మన హీరోలు పోటాపోటీగా ఒక స్పెషల్ చాలెంజ్ చేసుకొనున్నారు. అయ్యప్పన్ కొశీయుమ్ రీమేక్ పై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి అందులో మరో హీరో ఎవరనే విషయంలో అంచనాలు తారా స్థాయికి చేరాయి.
మొదటగా రానా దగ్గుబాటి అని టాక్ వచ్చింది గాని అఫీషియల్ గా ప్రకటించలేదు. ప్రొడక్షన్ హౌజ్ సీతారా ఎంటర్టైన్మెంట్ ఈ ప్రాజెక్ట్ విషయంలో పవన్ కళ్యాణ్ కి చెప్పకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. ఒకవేల నిర్ణయం తీసుకున్నా కూడా పవన్ కళ్యాణ్ ఓకే చెప్పాల్సిందే అంటున్నారు. ఆ తరువాత అఫీషియల్ ఎనౌన్స్మెంట్ గురించి ఆలోచిస్తున్నారు. దర్శకుడు సాగర్ చంద్ర విషయంలో కూడా అలానే చేశారట. ఇక ఇప్పుడు మరో హీరో పాత్ర కోసం నితిన్, సాయి ధరమ్ తేజ్ లిస్ట్ లో ఉన్న విషయం తెలిసిందే.

ఈ ఇద్దరిలో ఎవరో ఒకరిని ఫిక్స్ చేయాలని గత కొన్నిరోజులుగా ఎన్నో రకాలుగా చర్చలు జరుపుతున్నారు. నిజానికి పవన్ తో నటించడానికి ఈ ఇద్దరు హీరోలు కూడా సిద్ధంగానే ఉన్నారు. ఓ వైపు పవన్ అభిమాని, మరోవైపు మేనల్లుడు సాయి ధరమ్ తేజ్. ఇద్దరిలో ఎవరు సెలెక్ట్ అవుతారు అనే విషయంలో ఎవరు కూడా ఊహించలేకపోతున్నారు. ఇక పవన్ కూడా ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదట. దర్శక నిర్మాతలు మాత్రం పవర్ స్టార్ ముందు ఒక లిస్ట్ అయితే ఉంచిదని సమాచారం. మరి ఈ విషయంలో ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











