పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ ఎప్పుడో తెలుసా? క్రేజీగా పింక్ రీమేక్.. హింట్ ఇచ్చిన తమన్

గత కొన్ని రోజులుగా నాన్చుతూ వస్తోన్న పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ విషయంపై మరోసారి క్లారిటీ వచ్చేసింది. ఈ విషయంపై పవన్ కళ్యాణ్‌ను ఎన్నిసార్లు అడిగినా.. ముభావంగానే సమాధానం చెబుతూ దాట వేశాడు తప్పా.. ఇది విషయమని సూటిగా చెప్పలేకపోతున్నాడు. అయితే ఈ రీ ఎంట్రీపై పలువురు అధికారికంగా సమాచారమిచ్చినా.. పవన్ కన్ఫామ్ చేస్తే బాగుంటుదనేది అభిమానుల అభిప్రాయం.

దిల్ రాజు నిర్మాతగా..

దిల్ రాజు నిర్మాతగా..

పింక్ రీమేక్ విషయంలో త్రివిక్రమ్ పాత్ర ఉందని.. స్వయంగా ఆయనే చెప్పుకొచ్చాడు. ఆ సినిమా చూడమని అటు పవన్ కళ్యాణ్‌కు, ఇటు నిర్మాతలకు తానే చెప్పినట్టు త్రివిక్రమ్ ఈ మధ్య వివరణ ఇచ్చాడు. ఈ మేరకు దిల్ రాజు వేణు శ్రీ రామ్ దర్శకత్వంలో పింక్ రీమేక్ పనులను కూడా మొదలెట్టేశిన సంగతి తెలిసిందే.

తమన్ ట్వీట్‌తో మరోసారి..

తమన్ ట్వీట్‌తో మరోసారి..

అల వైకుంఠపురములో చిత్ర విజయంపై స్పందిస్తూ.. తమన్‌ను ప్రత్యేకంగా ప్రశంసించాడు పవన్ కళ్యాణ్. తాను ఆరాధించే పవన్ కళ్యాణ్ తనపై ప్రశంసలు కురింపించే సరికి ఉబ్బితబ్బిబైపోయాడు. ఈ క్రమంలో పవన్ తదుపరి సినిమాకు సంగీతం అందించడం చాలా సంతోషంగా ఉందని, తన నుంచి బెస్ట్ సంగీతాన్ని ఇచ్చేందుకు ప్రయత్నిస్థానని చెప్పుకొచ్చాడు.

ఫిబ్రవరిలో రంగ ప్రవేశం..

ఫిబ్రవరిలో రంగ ప్రవేశం..

అయితే ఈ సినిమాకు పవన్ ఇచ్చే డేట్స్ కూడా చాలా తక్కువే. అందుకే పవన్‌కు సంబంధించిన షూటింగ్ మొదలు పెట్టే లోపే మిగతా వ్యవహారాలన్నీ చక్కబెట్టుకోవాలని యూనిట్ భావిస్తోందట. ఈ మూవీ కోసం కేవలం పది రోజులు మాత్రమే పవన్ కేటాయించినట్టు తెలుస్తోంది.

భారీ రెమ్యూనరేషన్..

భారీ రెమ్యూనరేషన్..


దిల్ రాజు సినిమాకు పవన్ 50 కోట్ల రెమ్యూనరేషన్, లాభాల్లో కొంత శాతం వాటా తీసుకోబోతున్నట్టు టాక్. ఆ శాతం ఎంత అన్నది మాత్రం ఎవ్వరికీ తెలియదు. అయితే క్రిష్-ఎఎమ్ రత్నం సినిమాకు మాత్రం కేవలం 50 కోట్ల రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకుంటారని, ఇది పాత కమిట్మెంట్ కాబట్టి లాభాల్లో వాటా తీసుకోవడం లేదని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X