మాఫియా బ్యాక్ డ్రాప్ లో పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం
పవన్ కళ్యాణ్ తో తమిళ దర్శకుడు విష్ణు వర్ధన్ రూపొందించే చిత్రం మాఫియా బ్యాక్ డ్రాప్ లో రానున్నదని తెలుస్తోంది. అలాగే ఈ చిత్రం ఎక్కువ భాగం ఫారిన్ లొకేషన్స్ లో తీయాలని నిర్ణయించారు. 2011 ఫిబ్రవరిలో షూటింగ్ మొదలయ్యే ఈ చిత్రాన్ని 2012 సంక్రాంతికి విడుదల చేయా లని ప్లాన్ చేస్తున్నారు. వేదం, మర్యాద రామన్న నిర్మించిన ఆర్కా మీడియా వారు ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్ అని చెప్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్...తమిళ దర్శకుడు కరుణాకరన్ తో చేసిన బాలు..ఎబిసిడి చిత్రం కూడా మాఫియా బ్యాక్ డ్రాప్ లో రూపొందిందే. ఇక విష్ణు వర్ధన్ కి స్టైలిష్ దర్శకుడుగా మంచి పేరుంది. అజిత్ తో ఆయన రూపొందించిన భిళ్ళా ఆయనకి విపరీతమైన క్రేజ్ తెచ్చి పెట్టింది. ఈ చిత్రానికి యువన్‌శంకర్ రాజా సంగీతం అందించనున్నారు. 'గమ్యం', 'వేదం' చిత్రాల దర్శకుడు క్రిష్ సంభాషణలు సమకూరుస్తున్నారు. ఈ చిత్రానికి రచన: రాహుల్ కోడా, ఛాయాగ్రహణం: పి.ఎస్. వినోద్, కళ: సునీల్‌బాబు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విష్ణువర్థన్.


Click it and Unblock the Notifications











