హాట్ న్యూస్: పవన్,రామ్ చరణ్ కాంబినేషన్ లో...
హైదరాబాద్ : సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు విజయంతో మల్టి స్టారర్ చిత్రాలకు మళ్లీ ఊపు వచ్చింది. అదే ఊపులో రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందనుందని సమాచారం. బండ్ల గణేష్ చేయబోయే చిత్రం ఇదేనని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. మిర్చితో హిట్ కొట్టిన కొరటాల శివ ఈ చిత్రం డైరక్ట్ చేస్తాడని వినపడుతోంది. 2013 సెకండాఫ్ లో ఈ చిత్రం సెట్స్ కు వెళ్లే అవకాసం ఉందని చెప్తున్నారు.
'మిర్చి' చిత్రంతో దర్శకుడిగా మారిన ప్రముఖ మాటల రచయిత కొరటాల శివ తర్వాతి చిత్రం ఖరారైంది. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై బండ్ల గణేష్ ప్రస్తుతం 'బాద్‌షా', 'ఇద్దరమ్మాయిలతో' చిత్రాలను నిర్మిస్తున్నారు. తాజాగా ఆ బ్యానర్‌లో కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం గురించి నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ "ఓ ప్రముఖ కథానాయకుడితో కొరటాల శివ దర్శకత్వంలో భారీ చిత్రాన్ని నిర్మించబోతున్నాం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అన్ని వివరాలను తెలియజేస్తాం'' అని అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కొరటాల శివ.
కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన మిర్చి సినిమా వివరాల్లోకి వెళితే...ఈ రోజు విడుదలైన 'మిర్చి' చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండుకు భిన్నంగా అని చెప్పి... మళ్లీ పాత ఫ్యాక్షన్ స్టోరీని మిర్చి చిత్రంలో దర్శకుడు చూపెట్టాడని, సినిమా ఇది వరకు వచ్చిన పలు తెలుగు సినిమాల కిచిడీగా పేర్కొంటున్నారు సినీ పండితులు. ఒక బండ్ల గణేష్ విషయానికొస్తే... ప్రస్తుతం బండ్ల గణేస్ జూ ఎన్టీఆర్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో 'బాద్ షా' చిత్రం చేస్తున్నారు. అదే విధంగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్‌తో ఇద్దరమ్మాయిలతో చిత్రం కూడా నిర్మిస్తున్నారు. త్వరలో గణేష్ మహేష్ బాబుతో 'టపోరి' అనే టైటిల్ తో సినిమా చేయబోతున్నట్లు టాక్.


Click it and Unblock the Notifications











