తెలిసిపోయింది: 'అజ్ఞాతవాసి'లో పవన్ క్యారెక్టర్ ఇదే.. మరో ట్రెండ్ సెట్ చేస్తుందా?
Recommended Video

'అజ్ఞాతవాసి' కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. విడుదల దగ్గరపడుతున్న కొద్ది బయటకొస్తున్న లీక్స్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. మొదటి ఆటకే సినిమా చూసేయాలన్న ఆత్రుత అభిమానులకు నిద్రను కూడా దూరం చేస్తోంది. అంతలా 'అజ్ఞాతవాసి' కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి తరుణంలో.. సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర ఊహాగానం బయలుదేరడం.. వారిలో క్యురియాసిటీని రెట్టింపు చేస్తోంది.

పవన్ క్యారెక్టర్ పేరు..:
తనతో చేసిన రెండు సినిమాల్లోనూ పవన్ క్యారెక్టర్ ను డిఫరెంట్ నేమ్స్ తో పరిచయం చేశాడు దర్శకుడు త్రివిక్రమ్. అదే 'జల్సా'లో సంజయ్ సాహు.. 'అత్తారింటికి దారేది'లో గౌతమ్ నందా పేర్లతో హీరో క్యారెక్టర్ ను పరిచయం చేసిన ఆయన.. ఇప్పుడు కూడా మరో సరికొత్త పేరుతో పవన్ పాత్రను పరిచయం చేయబోతున్నాడట.

తెలిసిపోయింది.. 'ఏబీ'అంటే..:
ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతున్న ఊహాగానాల ప్రకారం.. 'అజ్ఞాతవాసి'లో పవన్ పాత్ర పేరు 'అభిషిక్త్ భార్గవ' అని టాక్. 'ఏబీ.. ఎవరో నీ బేబీ' అంటూ సాగే పాటను గమనిస్తే హీరో పాత్ర 'ఏబీ'తో లింకప్ అయి ఉందని అర్థమవుతుంది. ఆ షార్ట్ కట్ కు ఫుల్ ఫామ్ అభిషక్త్ భార్గవ అని అంటున్నారు.

పాటల్లోనూ 'క్లూ':
'అజ్ఞాతవాసి'లోని కొన్ని పాటల్లోనూ 'భార్గవ' అనే పదం అక్కడక్కడా వినిపిస్తూనే ఉంది. దీన్నిబట్టి ఏబీకి అబ్రివేషన్ 'అభిషక్త్ భార్గవ' అని ఫిక్స్ అయిపోయారట. సినిమాలో పవన్ సహోద్యోగులు కూడా ఆయన్ను 'ఏబీ' అని పిలుస్తుంటారట.

ఎలాంటి క్యారెక్టరైజేషన్?:
పాత్రల పరంగా సంజయ్ సాహు.. గౌతమ్ నందా రెండింటిలోనూ దగ్గరి ఛాయలు ఉన్నాయి. ఎమోషన్స్, ఎంటర్‌టైన్ మెంట్, బుల్లెట్‌లా పేలే డైలాగ్స్ తో తెరపై ఈ రెండు పాత్రలు అభిమానులు అలరించాయి. ఇప్పుడు 'అభిషక్త్ భార్గవ' కూడా అదే తరహా ట్రెండ్ క్రియేట్ చేస్తుందంటున్నారు అభిమానులు.

బిజీ బిజీగా ప్రొడ్యూసర్స్.:
సినిమా విడుదల తేదీ దగ్గరపడటంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు థియేటర్ల లిస్టు రెడీ చేసే పనిలో పడ్డారు. వీలైనన్ని ఎక్కువ థియేటర్లను 'అజ్ఞాతవాసి'తోనే నింపేయాలనుకుంటున్నారు. తద్వారా ఫెస్టివల్ హాలిడేస్ ఎఫెక్ట్ పడకుండా.. ముందుగానే భారీ కలెక్షన్లు రాబట్టాలని యోచిస్తున్నారు.


Click it and Unblock the Notifications











