'షాడో' లో పవన్ కళ్యాణ్ పాత్ర పేరు

By Srikanya

తమిళ దర్శకుడు విష్ణు వర్ధన్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేస్తున్న స్టైలిష్ ఎంటర్టైనర్ కి ఇప్పటివరకూ ఇంకా టైటిల్ ప్రకటించలేదనే సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో అతని పేరు జాక్సన్ రాబర్ట్ అని తెలుస్తోంది. ఈ పాత్ర ఓ మాఫియా డాన్ ది కావటంతో ఆ పాత్రను పవన్ ఫిక్స్ చేసారు. పవన్ తన సినిమాల్లో మొదటి నుంచి తన పాత్రలకు వెరైటీ పేర్లు పెట్టడం తెలిసిందే. ఖుషీలో సిద్దు..సిద్దార్ద రాయ్ పేరు బాగా పాపులర్ కావటంతో మొన్న తీన్ మార్ లోనూ మైకెల్ వేలాయుధం అనే పేరు పెట్టుకున్నారు. ఇక ఇప్పుడు ఇలా రాబర్ట్ పేరుతో కనపించనున్నాడు. విజయదశమి పర్వదినం నాడు ఓ పవర్‌ఫుల్ టైటిల్‌ను ప్రకటించబోతున్నాం అంటున్నారు నిర్మాతలు తిరుమలశెట్టి నీలిమ, శోభు యార్లగడ్డ. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది. సంఘమిత్ర ఆర్ట్స్, ఆర్కా మీడియా వర్క్స్ ప్రై. లిమిటెడ్ సంస్థల ఆధ్వర్యంలో తిరుమలశెట్టి నీలిమ, శోభు యార్లగడ్డ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సారాజేన్ డయాస్, అంజలీ లావానియాహీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రం కి రకరకాల టైటిల్స్ ప్రచారంలోకి వస్తున్నాయి. ఈ సందర్బంగా నిర్మాతలు ఇలా స్పందిస్తూ ప్రకటన చేసారు. అలాగే ఫస్ట్‌లుక్‌ను కూడా విడుదల చేయబోతున్నాం. ఇప్పటివరకూ పవన్‌కల్యాణ్ చేసిన సినిమాలకు భిన్నంగా ఈ చిత్రం తయారవుతోంది. తమిళంలో స్టైలిష్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న విష్ణువర్ధన్ ఈ చిత్రాన్ని సరికొత్త శైలిలో ఆవిష్కరిస్తున్నారు. పవన్‌ కల్యాణ్ పాత్ర చిత్రణ న్యూలుక్‌తో స్టైలిష్‌గా వుంటుంది. అభిమానులను ఆకట్టుకునే అంశాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఇంకా రెండు పాటలు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. దాంతో చిత్రీకరణ మొత్తం పూర్తవుతుంది. నవంబర్‌లో ఆడియో, డిసెంబర్‌లో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని తెలిపారు. జాకీష్రాఫ్, అడవి శేష్, అతుల్ కులకర్ణి, తనికెళ్ళ భరణి, బ్రహ్మానందం, అలీ, సుబ్బరాజు తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే: రాహుల్‌కోడా, కెమెరా: పి.ఎస్.వినోద్, కూర్పు: ఎం.శ్రీకర్‌ప్రసాద్, ఫైట్స్: శ్యామ్ కౌశల్, కళ: సునీల్‌ బాబు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X