ఇంట్రెస్టింగ్: పవన్ మేకప్ వేసుకోవడం లేదట.. ఈ టైమ్‌లో ఇలా ఉండడమే కరెక్ట్ అని నిర్ణయం

By Manoj Kumar P

కొద్ది రోజులుగా తెలుగు సినీ ఇండస్ట్రీతో పాటు పాలిటిక్స్‌లో హాట్ టాపిక్ అవుతున్న విషయాల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీఎంట్రీ ఒకటి. తాను స్థాపించిన పార్టీని నడిపించుకునేందుకు సినిమాలకు దూరం అయిన ఈ స్టార్ హీరో.. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన 'అజ్ఞాతవాసి' తర్వాత మరోసారి మేకప్ వేసుకోలేదు. దీంతో ఆయన అభిమానుల్లో తీవ్ర నిరాశలు అలముకున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన మరోసారి సినిమాల్లోకి వస్తున్నారని వార్తలు వచ్చాయి. తాజాగా దీనికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇంతకీ ఏంటా న్యూస్.? వివరాల్లోకి వెళితే..

ఎంతో మంది ప్రయత్నిస్తే ఆయనకు కుదిరింది

ఎంతో మంది ప్రయత్నిస్తే ఆయనకు కుదిరింది

పవన్ కల్యాణ్‌తో సినిమా చేయాలని చాలా మంది నిర్మాతలు ప్రయత్నాలూ చేసేవారు. ఇక, ఆయన రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత కూడా రీఎంట్రీ ఇప్పించాలని చాలా మంది తీవ్రంగా కృషి చేశారు. అలాంటి వారిలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా ఉన్నారు. ఈయన ఇరవై ఏళ్లుగా పవన్‌తో సినిమా చేయాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ కాంబో వర్కౌట్ అవుతోంది.

అన్నీ అఫీషియల్‌గా అవుతున్నాయి

అన్నీ అఫీషియల్‌గా అవుతున్నాయి

పవర్ స్టార్ రీఎంట్రీ ఇస్తున్నారన్నది గాసిప్ అనుకున్నారు చాలా మంది. ఈ క్రమంలోనే ఆయనతో సినిమా చేస్తున్నట్లు దిల్ రాజు ఈ మధ్య పలుమార్లు వెల్లడించారు. అంతేకాదు, ఇటీవల జరిగిన ‘ప్రతిరోజూ పండగే' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ‘త్వరలోనే పవన్ వస్తున్నాడు. పవర్ స్టార్‌తో సినిమా చేయాలన్నది నా 20 ఏళ్ల కల. అది కొద్ది రోజుల్లో తీరబోతుంది' అని స్టేజ్‌పై ప్రకటించారు.

భారీ హిట్ చిత్రంలో లాయర్ సాబ్‌గా

భారీ హిట్ చిత్రంలో లాయర్ సాబ్‌గా

బాలీవుడ్‌లో సూపర్ హిట్ అవడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రం ‘పింక్'. ఈ సినిమా రీమేక్‌ ద్వారానే పవన్ రీఎంట్రీ ఇస్తున్నాడు. మాతృకలో అమితాబ్ బచ్చన్ పోషించిన లాయర్ పాత్రను తెలుగులో పవన్ చేస్తున్నాడు. దీనికి ‘లాయర్ సాబ్' అనే టైటిల్ అనుకుంటున్నారు. తమిళంలో అజిత్ చేసిన సినిమా కూడా బంపర్ హిట్ అయింది.

ఈ సినిమాతో రికార్డ్ సృష్టిస్తాడా?

ఈ సినిమాతో రికార్డ్ సృష్టిస్తాడా?

ఆర్థిక వనరుల కోసమే సినిమాల్లో నటిస్తున్నానని పవన్ కల్యాణ్ ఇటీవల ప్రకటించాడు. దీంతో ఈ సినిమా కోసం ఆయన తీసుకోబోతున్న రెమ్యూనరేషన్ గురించి ఎన్నో వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్టు వల్ల పవర్ స్టార్‌కు భారీగా లాభం చేకూరనుందని అంటున్నారు. మొత్తంగా ఈ సినిమాకు తీసుకునే రెమ్యూనరేషన్‌తో పవన్ రికార్డు సృష్టించినా ఆశ్చర్యం లేదన్న టాక్ వినిపిస్తోంది.

 పవన్ మేకప్ వేసుకోవడం లేదట

పవన్ మేకప్ వేసుకోవడం లేదట

ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా కోసం పవన్ వచ్చే నెల 7 నుంచి జరగనున్న స్క్రీన్ టెస్ట్‌కు హాజరు కాబోతున్నాడట. దీనికి కారణం ఈ సినిమాలో తాను మేకప్ వేసుకోనని పవన్ చెప్పడమేనని సమాచారం. సహజత్వం కోసం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X