'సాంబ' రైటర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్?
రచయిత జియస్ రావు దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఓ చిత్రం చేయనున్నాడనే వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. జియస్ రావు గతంలో జూ ఎన్టీఆర్, వివి వినాయిక్ కాంబినేషన్ లో వచ్చిన 'సాంబ' చిత్రానికి కథ అందించారు. ఆయన గత కొంత కాలంగా దర్శకత్వ అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ లో కథ చెప్పి ఒప్పించి అక్కడ కొంత కాలం సిట్టింగ్స్ జరిపారని చెప్తున్నారు. రాణా కోసం ఆ సబ్జెక్టు అని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే రాణా తాను నటించిన లీడర్ రిలీజ్ వరకూ ఏ చిత్రం కమిట్ కాకుండా వెయిట్ చేయాలని నిర్ణయించుకున్నారు. దాంతో జియస్ రావు ఈ పవన్ కళ్యాణ్ ని కలిసి ఈ సబ్జెక్టును వినిపించి ఒప్పించారని తెలుస్తోంది. అయితే పవన్ కొన్ని మార్పులు చెప్పారని, అప్పుడే ఫైనల్ అవుతుందని చెప్తున్నారు. ఇక అధికారికంగా ఈ విషయమై ఏ సమాచారం లేదు. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేస్తున్న పులి చిత్రం ఫైనల్ స్టేజస్ లో ఉంది.


Click it and Unblock the Notifications











