పవన్‌ కళ్యాణ్ కొత్త చిత్రం టైటిల్ ‘లవ్‌ లీ’!?

By Srikanya

పవన్ కళ్యాణ్, జయంత్ పరాన్జీ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రానికి 'ఖుషీగా..."అనే టైటిల్ అనుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ చిత్రానికి 'లవ్ ‌లీ" అనే టైటిల్ పెడితే ఎలా ఉంటుందనే ఆలోచనలో దర్శక, నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ టైటిల్ ని ఇటీవల ఫిలిం ఛాంబర్ ‌లో సంస్థ రిజిస్ట్రేషన్ చేసారు కూడా. పవన్ కళ్యాణ్ కూడా ఈ టైటిల్ వైపే మ్రెగ్గు చూపుతున్నట్లు చెప్తున్నారు. 'ఖుషీగా..." అనే టైటిల్ పెట్టడంతో గతంతో తనే హీరోగా చేసిన 'ఖుషీ" చిత్రం అని పొరబడే ప్రమాదం ఉందని ఆయన భావిస్తున్నట్లు చెప్తున్నారు. ఇక ఈ చిత్రం హిందీ హిట్. 'లవ్ ఆజ్ కల్" హిందీ చిత్రం ఆధారంగా కొద్దిపాటి మార్పు చేర్పులతో తెలుగు నేటివిటీకి అనుగుణంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇంతకుముందే కాశీ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సంబంధించి ఈ నెల 14 నుంచి 40రోజులపాటు న్యూజిలాండ్ ‌లో ఓ భారీ షెడ్యూల్ జరపనున్నారు. ఈ చిత్రానికి మాటలు: త్రివిక్రమ్, సంగీతం: మణిశర్మ. పవన్ ‌కళ్యాణ్ సరసన త్రిష, కృతికర్బందా హీరోహీరోయిన్లుగా పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో నటుడు గణేష్‌ బాబు నిర్మిస్తారు. ఇక ఈ రెండు టైటిల్స్ లో ఏది చిత్రానికి ఫైనల్ చేస్తారో తెలియాల్సి ఉంది. ఇంతకీ ఏ టైటిల్ అయితే బాగుంటుందంటారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X