విలన్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ న్యూ ప్రాజెక్ట్.. అలా సెట్ చేసిన త్రివిక్రమ్!
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం శరవేగంగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్న అగ్రహీరోలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా పవన్ కళ్యాణ్ గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నారు. ఓ వైపు రాజకీయాలు ప్రజల సమస్యలపై స్పందిస్తూ మరోవైపు కెమెరా ముందు కూడా తన నట జీవితాన్ని కొనసాగిస్తున్నారు. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ మరింత బిజీ కానున్నట్లు తెలుస్తోంది.

ఆదాయాన్ని పెంచుకోవాలని..
ప్రస్తుత పరిస్థితుల్లో పొలిటిక్స్ లో ఆర్థికంగా నిలదొక్కుకోవాలి అంటే పవన్ కళ్యాణ్ సినిమాల ద్వారానే తన ఆదాయాన్ని పెంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇక ఇటీవల త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓకే చేసిన మరో ప్రాజెక్టును పవన్ కళ్యాణ్ కోసం చేసినట్లుగా తెలుస్తోంది. విలన్ గా చేసిన నటుడు ఆ సినిమాను డైరెక్ట్ చేయనున్నట్లు సమాచారం.

త్రివిక్రమ్ - పవన్ కాంబో..
సోషల్ మీడియా లో ఎన్నో కథనాలు వెలువడిన కూడా పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మధ్యలో విభేదాలు లేవని చాలాసార్లు రుజువైంది. ఇక వీరి కలయికలో మరొక సినిమాను చూడాలని ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు చివరగా వచ్చిన అజ్ఞాతవాసి సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాన్ని అందుకున్న విషయం తెలిసిందే.

త్రివిక్రమ్ ను కలవాల్సిందే..
ఆ తర్వాత భీమ్లా నాయక్ సినిమాతో పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కలుస్తున్నప్పటికి కూడా కేవలం మాటల వరకు దర్శకత్వ పర్యవేక్షణ వారికే మాటల మంత్రికుడి బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ ఎలాంటి సినిమాలు చేయాలి అనే విషయంపై కూడా త్రివిక్రమ్ చాలా సలహాలు ఇస్తున్నారని అర్థమవుతోంది. పవన్ కళ్యాణ్ కథ చెప్పాలి అంటే ముందుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ కు చెప్పాల్సిందే అనే విధంగా ఇండస్ట్రీలో ఒక టాపిక్ నడుస్తోంది.

మరో రీమేక్..
ఇక ఇటీవల వెండితెర విలన్ దర్శకత్వంలో కూడా పవన్ కళ్యాణ్ సినిమా చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఆ ప్రాజెక్టును త్రివిక్రమ్ స్వయంగా సెట్ చేసే ఆలోచనలో ఉన్నాడట. తమిళంలో బాక్సాఫీస్ హిట్గా నిలిచిన సముద్రఖని వినోదాయ సీతం చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్నారట. సముద్రఖని తమిళంలో ఆ కథకు దర్శకత్వం వహించగా, రీమేక్‌కు కూడా ఆయనే దర్శకత్వం వహించనున్నారట.

సముద్రఖని దర్శకత్వంలో
ప్రస్తుతం టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న సముద్రకని అల వైకుంఠ పురములో సినిమాలోనే కాకుండా క్రాక్ సినిమాలో కూడా ప్రధాన విలన్ గా మెప్పించిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం RRR సినిమాల్లో కూడా ఆయన ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతున్నారు. దర్శకుడిగా కూడా బిజీ అవ్వాలని ఆలోచిస్తున్న సముద్రఖని పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేయడానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
Recommended Video

ఆ సినిమా క్యాన్సిల్ ?
ఇక ఆ సినిమా స్క్రిప్టును తెలుగులో పూర్తిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తన దైన శైలిలో రెడీ చేస్తారని తెలుస్తోంది. త్రివిక్రమ్ కూడా ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రామ్ తళ్లూరి
SRT ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో నిర్మించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఇది వరకు ఈ బ్యానర్ లో పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి తో ఒక సినిమా చేయాలని అనుకున్నాడు. బహుశా ఆ కాంబినేషన్ ఇప్పట్లో తెరపైకి రాకపోవచ్చని తెలుస్తోంది. మరి సముద్రఖని ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ కు ఎలాంటి విజయాన్ని అందిస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











