పవన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ "అర్జున్ రెడ్డి" సందీప్ వంగా తో??? నిజమా రూమరా!?

ఎన్ని నిజాలో మరెన్ని పుకార్లో తెలీదు గానీ రోజుకో భారీ ఆఫర్ సందీప్ దగ్గరకు వస్తున్నట్టు వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇవి నిజాలు అవునాకాదా అన్నది కూడా పట్టించుకోవటం లేదెవ్వరూ. ఎందుకంటే సందీప్ వంగా చేసిన మ్య

Recommended Video

పవన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ "అర్జున్ రెడ్డి" దర్శకుడితో ?

"అర్జున్ రెడ్డి" ఈ ఒక్క సినిమా ఓవర్ నైట్ లో అటు హీరో విజయ్ దేవరకొండ నీ, ఇటు దర్సకుడు సందీప్ రెడ్డి వంగా నీ ఓవర్ నైట్ మోస్ట్ వాంటెద్ లిస్ట్లో చేర్చేసింది. వరుస ఆఫర్లతో ఇప్పటికే విజయ్ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయాడు. ఇక సందీప్ గురించైతే రోజుకో వార్త హల్ చల్ చేస్తోంది. ఎన్ని నిజాలో మరెన్ని పుకార్లో తెలీదు గానీ రోజుకో భారీ ఆఫర్ సందీప్ దగ్గరకు వస్తున్నట్టు వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇవి నిజాలు అవునాకాదా అన్నది కూడా పట్టించుకోవటం లేదెవ్వరూ. ఎందుకంటే సందీప్ వంగా చేసిన మ్యాజిక్ అలాంటిది.

మైత్రీ మూవీ మేక‌ర్స్

మైత్రీ మూవీ మేక‌ర్స్

నిన్నటికి నిన్న 'శ్రీమంతుడు', 'జ‌న‌తాగ్యారేజ్' వంటి సినిమాలు నిర్మించిన 'మైత్రీ మూవీ మేక‌ర్స్' అధినేత‌లు.. సందీప్‌ను సంప్ర‌దించార‌నీ, త‌మ బ్యాన‌ర్‌లో సినిమా చేసేలా సందీప్‌ను ఒప్పించేందుకు 50 ల‌క్ష‌ల రూపాయ‌లు అడ్వాన్స్ కూడా ఇచ్చార‌ని, ఇప్పుడు రామ్‌చ‌ర‌ణ్‌తో 'రంగ‌స్థలం', నాగ‌చైత‌న్యతో 'స‌వ్య‌సాచి' సినిమాలు నిర్మిస్తోంన్న ఈ సంస్థ, ఈ స‌మ‌యంలోనే సందీప్‌తో మ‌రో సినిమా ప్రారంభించాల‌ని భావిస్తున్నారంటూ వార్తలు వచ్చి ఇరవై నాలుగ్గంటలు గడవనే లేదు.

పవన్ కళ్యాణ్ కోసం సందీప్ స్టోరీ

పవన్ కళ్యాణ్ కోసం సందీప్ స్టోరీ

పవన్ కళ్యాణ్ నుండి సందీప్ వంగాకి ఫోన్ వెళ్లినట్లుగా ఫిల్మ్ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తల సారాంశం ఏమిటంటే పవన్ కళ్యాణ్ కోసం సందీప్ వంగా మంచి స్టోరీని రెడీ చేశాడంట. అన్నీ కుదిరితే పవన్ కళ్యాణ్‌ని సందీప్ డైరెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని తాజాగా వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.

పవన్ ఫోన్ చేసి మరీ

పవన్ ఫోన్ చేసి మరీ

పవన్ కళ్యాణ్‌కి కూడా సందీప్ డైరెక్ట్ చేసిన 'అర్జున్‌రెడ్డి' చిత్రం బాగా నచ్చి, ఫోన్ చేసి మరీ అభినందించినట్లుగా మొదలైన ఈ వార్తలు, మంచి స్టోరీ ఉంటే చేద్దామని పవన్ అనడం, వెంటనే ఓ లైన్‌ని పవన్‌కి వినిపించడం, పవన్‌కి నచ్చి డెవలప్ చేయమని చెప్పడం వంటివి వెంటవెంటనే జరిగిపోయాయనే వార్తలు నెట్ మాయాజాలంలో సంచరిస్తున్నాయి.

అప్పుడెప్పుడో కమిట్ అయ్యాడు

అప్పుడెప్పుడో కమిట్ అయ్యాడు

అయితే రీసెంట్‌గా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మాతలు ఓ మూవీ కోసం సందీప్‌కి అడ్వాన్స్‌గా 50 లక్షలు ఇచ్చారనే వార్తలు వినిపించాయి. మైత్రీ మూవీస్ బ్యానర్‌కి పవన్ ఓ సినిమా చేయడానికి అప్పుడెప్పుడో కమిట్ అయ్యాడు. అందువల్లే మరి ఈ వార్తలు పుట్టుకొచ్చాయో, లేక నిజంగానే తెరవెనుక ఇటువంటిదేమైనా జరుగుతుందో తెలియదు కానీ, పవన్‌తో సందీప్ సినిమా అంటే టాలీవుడ్‌ని సందీప్ వంగా ఏలడం మాత్రం ఖాయం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X