పవన్ నో చెప్పేసాడు...అందుకే
హైదరాబాద్ : విజయ్ తాజా చిత్రం కత్తిని పవన్ తో రీమేక్ చేయాలని ఠాగూర్ మధు ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. మురగదాస్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం కావటంతో పవన్ సైతం ఉత్సాహం చూపించి నిన్న సాయింత్రం స్పెషల్ షోను చూసారు. అయితే అందుతున్న సమచారాన్ని బట్టి ఈ చిత్రం పవన్ కి నచ్చలేదని తెలుస్తోంది. అందుకే నవంబర్ 21 న డబ్బింగ్ వెర్షన్ విడుదల చేయటానికి డిస్ట్రిబ్యూటర్స్ కు తేదీని ప్రకటించేసారని ట్రేడ్ వర్గాల సమాచారం.
మరో ప్రక్క మెగాభిమానులు పవన్‌కళ్యాణ్, వెంకటేష్‌లు కలిసి నటిస్తు న్న మల్టీస్టారర్ 'గోపాల గోపాల చిత్రంకంటే 'గబ్బర్‌సింగ్ 2 కోసమే ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పవన్‌కళ్యాణ్ 'గబ్బర్‌సింగ్ 2' చిత్రానికి లైన్‌క్లియర్ అయినట్లే కనిపిస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం స్క్రిప్ట్ పనులన్నీ పూర్తయినట్లేనని తెలిసింది. నవంబర్ నుండి హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందని సమాచారం.
సంపత్‌నంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం బడ్జెట్ దాదాపు 70 కోట్లు అని తెలిసింది. ఏరోస్‌వారు ఈ చిత్రానికి సహనిర్మాతలుగా వ్యవ హరిస్తూ ఈ బడ్జెట్ పెట్టడానికి ముందుకువచ్చారట. 'రచ్చతో ఆకట్టుకు న్న సంపత్‌నంది ఆ తర్వాత చేస్తున్న చిత్రమిదే కావడం గమనార్హం. ఈ చిత్రానికి పవన్‌కళ్యాణ్ స్నేహితుడు శరత్‌మరార్ నిర్మాత. తొలిసారి సినీ నిర్మాణరంగంలోకి అడుగుపెడుతున్న తన స్నేహితుడికి మేలు జరగాలనే ఉద్దేశ్యంతో ఈ సీక్వెల్ నిర్ణయం పవన్ తీసుకున్నాడు.

ప్రస్తుతం పవన్ 'గోపాల గోపాల షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఈ చిత్రం లో పవన్‌కళ్యాణ్ షూటింగ్‌పార్ట్ ఈ నెలతో పూర్తవుతుంది. ఈ షూటింగ్ పూర్తయిన తర్వాత అంటే నవంబర్‌లో ఈ 'గబ్బర్‌సింగ్ 2 చిత్రం షూటింగ్‌లో పవన్ పాల్గొంటాడు. దేవుడికి కొబ్బరికాయ ఎందుకు కొట్టాలి? హుండీలో డబ్బులెందుకు వేయాలి? హారతి ఇవ్వకపోతే దేవుడు మొర ఆలకించడా? ఇలాంటి సవాలక్ష సందేహాలున్నాయి అతనికి. దేవుడుంటే ఈ సృష్టినంతటినీ సమానంగా చూడాలి కదా? ఒకరెక్కువ, ఒకరు తక్కువ అనే బేధాలెందుకు అంటూ స్వామీజీలనూ తన పశ్నలతో హడలెత్తించాడు. జవాబులు దొరకలేదు. చివరికి సమాధానం ఇవ్వడానికి స్వయంగా శ్రీకృష్ణుడే దిగొచ్చాడు. ఆ వైనం ఏ రీతిన సాగిందో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు కిషోర్‌కుమార్ పార్థసాని (డాలీ). ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'గోపాల గోపాల'.
పవన్‌కల్యాణ్ 'గోపాల గోపాల'లో మోడ్రన్ శ్రీకృష్ణుడి పాత్రని పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం హిందీ ఓ మైగాడ్ రీమేక్. ఈ చిత్రంఒరిజనల్ లో అక్షయ్ కుమార్ ఓ బైక్ మీద వచ్చి హల్ చల్ చేస్తాడు. ఇప్పుడు అదే టైప్ లో పవన్ సైతం ఓ స్పెషల్ బైక్ లో వస్తారు. ఆ బైక్ డిజైన్ మీరు చూస్తున్నదే. అది ఇటీవలే బయిటకు వచ్చింది. దానిపై ఓమ్ ...786 అని ఉంది. హ్యూసంగ్ జీవి 650 అఖీలా పీఆర్ఓ ఈ బైక్ పేరు. భారీ ఆకారంతో భారీ సీసి ఉన్న బైక్ ఇది. సినిమా రిలీజయ్యాక ఈ బైక్ గురించి చాలా కాలం అభిమానులు మాట్లాడుకుంటారని అంచనా వేసి మరీ అన్ని జాగ్రత్తలూ తీసుకుని మరీ ఈ బైక్ ని ఇలా డిజైన్ చేసారు. ఈ బైక్ ఖరీదు 6,60,000.
ఇక ఈ చిత్రంలో పవన్ పలికే సంభాషణలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని సమాచారం. వెంకటేష్ మరో హీరోగా చేస్తున్న సినిమాలో పవన్ పాత్ర కేవలం 25 నిముషాలేట. అయితే ఇప్పుడు అభిమానులు నిరాశపడతారని దాని నిడివి పెంచినట్లు సమాచారం. ఆ పాత్ర ఇప్పుడు సెకండాఫ్ లో దాదాపు పూర్తిగా ఉంటుంది. కీలకమైన సన్నివేశాల్లో దాదాపు 45 నిముషాల సేపు కనపిస్తాడట. ఇరవై నిముషాల సేపు ఆయన పాత్ర నిడివి పెంచారని సమాచారం. సంక్రాంతికి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో శ్రియ ముఖ్యపాత్రలో కనిపిస్తుంది. కృష్ణుడు, మధుశాలిని, వెన్నెల కిషోర్, దీక్షా పంత్ తదితరులు ఇతర పాత్రధారులు. చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, ఛాయాగ్రహణం: జయనన్ విన్సెంట్, కూర్పు: గౌతంరాజు, శరత్‌మరార్. సురేష్‌బాబు నిర్మాతలు.


Click it and Unblock the Notifications











