పవన్ సినిమాను సీరియస్‌గా తీసుకున్న త్రివిక్రమ్.. అజ్ఞాతవాసిని మర్చిపోయేలా..
టాలీవుడ్ ఇండస్ట్రీలో బెస్ట్ కాంబినేషన్ లిస్ట్ తీస్తే అందులో పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ పేర్లు టాప్ లో ఉంటాయని చెప్పవచ్చు. కేవలం ప్రొఫెషినల్ గానే కాకుండా పర్సనల్ గా కూడా ఎంతో సన్నిహితంగా ఉండే ఈ ఇద్దరు కలిస్తే అంచనాలు హై వోల్టేజ్ లో ఉంటాయి. వీరిద్దరు మరో సినిమా చేస్తే బావుంటుందని అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు.

సలహాలు చాలానే వచ్చాయట
అయితే త్రివిక్రమ్ మాత్రం సరైన కథ తగిలే వరకు పవన్ ను టచ్ చేయవద్దని అనుకుంటున్నాడు. ఇక ఇటీవల మొత్తానికి అయ్యప్పనుమ్ కొశీయుమ్ రీమేక్ కోసం మాటలు రాయడానికి రెడీ అయిన విషయం తెలిసిందే. ఆ సినిమాను త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తే బావుంటుందని చాలా మంది సలహా ఇచ్చారాట.

అందుకే డైరెక్ట్ చేయలేదట
అయితే అయ్యప్పనుమ్ కొశీయుమ్ రీమేక్ ను డైరెక్ట్ చేస్తే ఆడియెన్స్ లో పెరిగే అంచనాల వల్ల సినిమాను చూసే విధానం మారిపోవచ్చని అందుకే ఆ ప్రాజెక్ట్ కు కేవలం మాటలు అందించడానికి రెడీ అయ్యారట. అభిమానులు మాత్రం మళ్ళీ వీళ్ళ కాంబినేషన్ లో అత్తారింటికి దారేది లాంటి హిట్టు సినిమా చూడాలని అనుకుంటున్నారు.

మరో లెవెల్లో ఉండాలని
ఇక ఆజ్ఞాతవాసి డిజాస్టర్ తో అభిమానులు ఎంతగానో బాధపడ్డారు. ఆ డిజాస్టర్ ను మర్చియేలా చేయడానికి ముందుగా వకీల్ సాబ్ వస్తున్నప్పటికీ అయ్యప్పనుమ్ కొశీయుమ్ రీమేక్ మాత్రం మరో లెవెల్లో ఉండాలని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడట. ఆ సినిమాను సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తున్నప్పటికీ త్రివిక్రమ్ సలహాలతోనే ప్రాజెక్ట్ కొనసాగుతున్నట్లు సమాచారం.

సీరియస్ గా తీసుకున్న త్రివిక్రమ్
ఇక సినిమాలో డైలాగ్స్ బాధ్యత త్రివిక్రమ్ తీసుకున్న విషయం తెలిసిందే. సాధారణంగా త్రివిక్రమ్ ఒక నెలలో డైలాగ్స్ రాసి ఇవ్వగలరు. కానీ ఈ సినిమాకు ఆయన చాలా సమయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తో కూర్చొని మూడు పాటలను కూడా ఫైనల్ చేయించారట. ఈ సినిమాను త్రివిక్రమ్ అందరికంటే ఎక్కువ సీరియస్ గా తీసుకున్నట్లు ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే వినిపిస్తోంది. మరి ఆ సినిమా అభిమానుల అంచనాలను ఎంతవరకు అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











