'పులి' నిర్మాతకు పవన్ కళ్యాణ్ ట్విస్ట్

By Srikanya

పవన్ కళ్యాణ్ హీరోగా ఎస్.జె.సూర్య దర్శకత్వంలో రూపొందుతున్న కొమురం పులి చిత్రం పాటలు పూర్తి చేసి ఫైనల్ దశలో ఉన్న సంగతి తెలిసిందే. ఇక డబ్బింగ్ ఒక్కటి పూర్తయితే మొత్తం వర్క్ ఫినిష్ అయినట్లే. అయితే తన రెమ్యునేషన్ బ్యాలెన్స్ పంపితేనే డబ్బింగ్ చెపుతానని పవన్ నిర్మాతకు కబురు పంపారని తెలుస్తోంది. దాంతో నిర్మాత లబోదిబోమన్నాడని చెప్పుకుంటున్నారు. ఇది జరగటానకి రెండు నెలల ముందే ...అనుకున్న దానికన్నా ఎక్కువ బడ్జెట్ అయిందని ప్రస్తుతం ఉన్న పరిస్ధితుల్లో ఎడ్జెస్ట్ కావల్సిందేనని నిర్మాత ప్రత్యేకంగా కలిసి చెపితే ఓకే చేసిన పవన్ మళ్ళీ ఇలా రివర్స్ లో పంచ్ ఇవ్వటం తట్టుకోలేకపోతున్నట్లు చెప్తున్నారు. అయితే ఎగ్రిమెంట్ ప్రకారం అనుకున్న రెమ్యునేషన్ క్లియర్ చేయందే డబ్బింగ్ చెప్పకుండా ఆపటం ఆనవాయితీనే అని అది ఇప్పటి సంప్రదాయమేమీ కాదని దాదాపు సినీ పరిశ్రమ డబ్బింగ్ దశలోకి అడుగుపెట్టిన నాటి నుంచీ జరుగుతున్నదేనని పవన్ ని తప్పుపట్టాల్సిన పనిలేదని మరికొందరు సమర్దిస్తున్నారు.

ఇక నిర్మాత శింగనమల రమేష్ అటు త్రివిక్రమ్, మహేష్ చిత్రం ఓ కొలిక్కి రాక ఇబ్బంది పడుతూ..ఇటు పులి పూర్తయితే అమ్ముకుని రిలాక్స్ అవుదామని ప్రయత్నిస్తూండగా ఈ ట్విస్ట్ పడింది. దాంతో ఎక్కడోచోట డబ్బు తెచ్చి ఈ డబ్బింగ్ కానిచ్చేయాలని యోచిస్తున్ట్లు సమాచారం. ఇక ఈ చిత్రానికి ఎ.ఆర్.రహమాన్ సంగీతం అందిస్తున్నారు. లండన్ కి చెందిన నిఖిషా పటేల్ హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ఇందులో పవన్ పోలీస్ గెటప్ లో కనపించనున్నారు. ఇక ఈ చిత్రంలో మనోజ్‌ బాజ్‌పాయ్‌, గిరీష్‌ కర్నాడ్‌, చరణ్‌రాజ్‌, నాజర్‌, జ్యోతికృష్ణ, శరణ్య, బ్రహ్మాజీ, అలీ, కోవై సరళ, హనీఫా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: బినోద్‌ ప్రధాన్‌, ఆర్ట్‌: ఆనంద్‌సాయి, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: బి.బుల్లి సుబ్బారావు, సమర్పణ: ఎస్‌.సత్యరామమూర్తి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X