ఒక్క సినిమా.. 40 కోట్ల రెమ్యునరేషన్.. పవన్‌కు ఎన్నారై నిర్మాతల వల!
టాలీవుడ్‌లోకి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ తర్వాత బడా నిర్మాతలు ఆయనతో సినిమా చేయడానికి క్యూ కడుతున్నారనే వార్తలు ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతున్నాయి. పవన్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారనే వార్తల మధ్య పలువురు నిర్మాతలు ఆయనతో సంప్రదింపులు జరిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. అయితే తాజాగా పలువురు ఎన్నారై నిర్మాతలు ఆయనతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతూ భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్టు తెలుస్తున్నది. వివరాల్లోకి వెళితే..

పవన్ స్పీడ్‌కు కరోనా బ్రేక్
ప్రస్తుతం కనీసం మూడు సినిమాలను చేతిలో పెట్టుకొని పవన్ కల్యాణ్ ముందుకెళ్తున్నారు. ఆయన స్పీడ్‌కు కరోనా కాస్త బ్రేక్ వేసింది. లేకపోతే ఈ పాటికి పింక్ రీమేక్ సినిమా రిలీజ్ డేట్ ప్రకటన అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేసేది. వకీల్ సాబ్ రిలీజ్ కాస్తా ప్రస్తుతం అభిమానులను కొంత నిరాశకు గురిచేసిందనే చెప్పవచ్చు.

క్రిష్ విరూపాక్షపై కసరత్తు
ఇలా ఓ వైపు కరోనా లాక్‌డౌన్‌ను అమలు చేస్తూనే.. మరోపక్క ట్వీట్లతో రాజకీయం, ఇటు విరూపాక్ష స్క్రిప్టుపై కుస్తీ పడుతున్నట్టు తెలిసింది. ప్రస్తుతం క్రిష్ రూపొందించే విరూపాక్ష సినిమా స్క్రిప్టుపై వర్క్ చేస్తూనే.. మూవీకి అవసరమయ్యే, పాత్రకు సరిపడే గెటప్, ఫిజిక్ కోసం కష్టపడుతున్నట్టు సమాచారం.

పలువురు నిర్మాతలతో భేటీ
ఇటీవల పవన్ కల్యాణ్‌తో పలువురు నిర్మాతలు భేటీ అయ్యారని, సినిమా చేయడానికి అంగీకరిస్తే భారీ రెమ్యునరేషన్ ఇచ్చేందుకు సిద్దమని చెప్పినట్టు సమాచారం. అయితే అందుకు రాజకీయ పరిస్థితుల దృష్ట్యా పవన్ కల్యాణ్ వేచి చూసే ధోరణితో ఉన్నట్టు చెప్పినట్టు తెలిసింది.
Recommended Video

ఎన్నారై నిర్మాతలు ఉత్సాహం
విరూపక్ష, పింక్ రీమేక్ బిజీలో ఉన్న పవన్ కల్యాణ్‌తో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అలాగే ఎన్నారై నిర్మాత రామ్ తాళ్లూరి కలిసినట్టు సమాచారం. వారు స్క్రిప్టుతోపాటు పలు విషయాలను చర్చించడంతోపాటు సినిమాకు రూ.40 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నట్టు ఫిలింనగర్‌లో ప్రచారం జరుగుతన్నది.


Click it and Unblock the Notifications











